Anchor pradeep : బుల్లితెరపై యాంకర్ ప్రదీప్ కు మంచి క్రేజ్ వున్న సంగతి తెలిసిందే..ఇతని యాంకరింగ్ బోర్ కొట్టించదు..యాంకర్స్ లలో సుమ తర్వాత అంత ఫాలోయింగ్ ప్రదీప్ కు ఉంది..ఇండస్ట్రీకి వచ్చి ఇన్ని సంవత్సరాలు గడుస్తున్న ప్రదీప్ ఇప్పటికీ తన స్టైల్ మార్చకుండా అదే స్టైల్ లో యాంకరింగ్ చేస్తూ పద్ధతి గల యాంకర్ అని అనిపించుకున్నాడు. త్వరలో ఓ ఇంటివాడు కాబొతున్నాడు.. అతను పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి గురించి ఎన్నో రకాల వార్తలు వస్తున్నాయి.. ఆమె ను ప్రదీప్ వివాహం చేసుకుంటున్నాడట..
కాగా, యాంకరింగ్ మాత్రమే కాదు..అటు సినిమాలలో కూడా ఛాన్సులు వస్తున్నాయి.చాలా సినిమాల్లో కనిపించి మెప్పించాడు..ఇక గతేడాది ప్రదీప్ హీరోగా ‘ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా ‘ అనే సినిమాలో నటించాడు. ఈ సినిమా యావరేజ్ టాక్ ని తెచ్చుకుంది.టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనగానే అందరికీ గుర్తొచ్చేది ప్రభాస్. అదేవిధంగా బుల్లితెరపై మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అంటే ప్రదీప్ నే అంటారు. బ్యాచిలర్ గా పేరు తెచ్చుకున్న ప్రదీప్ పెళ్లి చేసుకోవాలనేది అభిమానుల కోరిక.
కొన్ని సంవత్సరాలుగాc పెళ్లి వార్త ఎప్పుడు చెప్తాడా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇక, ప్రదీప్ పెళ్లి పై రూమర్స్ కూడా వచ్చాయి. వాటన్నిటిపై ప్రదీప్ ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది.. ప్రదీప్ త్వరలోనే పెళ్లి చేసుకుంటున్నాడని సోషల్ మీడియా లో తెగ ట్రోల్ అవుతుంది..అంతేకాదు.. ప్రదీప్ డిసెంబర్ 26 ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నాడు అని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇక ప్రదీప్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరో కాదు ఫ్యాషన్ డిజైనర్ నవ్య.
ఆమె పలువురు స్టార్ట్ సెలబ్రిటీస్ కి డిజైనర్ గా వర్క్ చేస్తుంది. వీళ్ళిద్దరూ చాలా రోజులుగా రిలేషన్ షిప్ లో ఉన్నారని, వీళ్ళ ప్రేమ పెళ్ళి వరకు వెళ్లిందని అంటున్నారు. ఫిబ్రవరి రెండో వారంలో ప్రదీప్ పెళ్లి చేసుకోబోతున్నాడని తెలుస్తుంది. ఇద్దరి మతాలు వేరైనప్పటికీ వాళ్లు సంతోషంగా ఉండాలని పెద్దలు వారి వివాహం చేస్తున్నట్లు తెలుస్తోంది… ఈ వార్తలొ ఎంత నిజముందో తెలియాలంటే మరో మూడు రోజులు ఆగాల్సిందే.. ఏది ఏమైనా ప్రదీప్ పెళ్ళి ఓకే కానీ శ్రీముఖి, రేష్మీ ల పెళ్లి ఎప్పుడో చూడాలి మరి..