Renu Desai పై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బండబూతులు.. వైరల్

- Advertisement -

Renu Desai ఏప్రిల్ 8 న పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్ పుట్టినరోజు సందర్బంగా రేణుదేశాయ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మధ్య పెద్ద వాగ్వదం జరిగిన విషయం తెలిసిందే..రేణు దేశాయ్ తన ఇంస్టాగ్రామ్ వేదికగా అకిరా నందన్ ను తన ఒడిలో కూర్చోబెట్టుకొని ఒక వీడియో షేర్ చేస్తూ ఎన్ని ఏళ్ళు వచ్చినా ఇప్పుడే పుట్టినట్టు ఉంది అంటూ కామెంట్ చేసింది. దానికి ఒక నెటిజన్ అప్పుడప్పుడు ఇలా అఖీరానందన్ ను చూపిస్తూ ఉండండి.. మా అన్న కొడుకుని చూపిస్తే మాకు ఆనందంగా ఉంటుంది అంటూ కామెంట్ చేశాడు.దానికి రియాక్ట్ అయిన రేణు దేశాయ్.. మీ అన్న కొడుకు కాదు.. నా కొడుకు ఇలాంటి ఎన్నో భరిస్తూ వచ్చాను.. ఇకపై భరించాల్సిన అవసరం లేదు.. బుర్ర దగ్గర పెట్టుకొని మాట్లాడండి అంటూ ఘాటువాఖ్యలు చేసింది.

Renu Desai
Renu Desai

అయితే దీనికి ఒక నెటిజన్ దారుణమైన కామెంట్ చేశాడు. దాన్ని కూడా ఆమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ఇక అందులో పేరు హైడ్ చేయబడింది. ఒక నెటిజన్..’ మా అన్న కొడుకుని చూపించండి అంటే నెగిటివ్ కామెంటా..? అరె పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ దీన్ని అన్ ఫాలో కొట్టి అసలు లైక్స్, కామెంట్స్ ఏం పెట్టకండి. 2024 ఎలక్షన్స్ కి ఈ చిల్లర్ ది కొత్త స్టంట్ లు స్టార్ట్ చేసింది.. ఇది ఎదో పెద్ద ప్లాన్ చేస్తుంది అంటూ నోటికి వచ్చిన బూతులను అన్నాడు..అది ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్న విషయం తెలిసిందే..

పవన్ కళ్యాణ్ బయోలాజికల్ ఫాదర్ అయినప్పుడు అన్నా కొడుకు కాకుండా ఏమనాలి? పవన్ కళ్యాణ్ దీన్ని వదిలేసి మంచి పని చేశాడు. ఇదే చిల్లర వేషాలు ఇంట్లో వేస్తే బయట గెంటేసినట్టున్నారు అంటూ కామెంట్ చేసి రేణు దేశాయ్ ఫోటో షేర్ చేశాడు.దీనిపై మండిపడ్డ రేణు దేశాయ్ మీరు ఒక మంచి కుటుంబం చూస్తే ఇలా ఎలా కామెంట్ చేయగలరు? ఒకసారి మీ తల్లిని అడగండి.. ఇది కరెక్ట్ ఉందా అంటూ ఆమె ప్రశ్నించారు..ఇది చూసిన చాలామంది ఒక మహిళను ఇంత దారుణంగా కామెంట్లు చేయడం ఏమాత్రం సబబు కాదు. మీ అభిమాన హీరో ఉంటే మీ వరకే ఉండాలి..వారి ఫ్యామిలీని ఇలా వల్గర్ గా నిందించాల్సిన పనిలేదు.. అంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.. మొత్తానికి ఇది నెట్టింట వైరల్ అవుతుంది..

renu
Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here