Pawan Kalyan చేతికి ఉన్న తాబేలు ఉంగరం వెనుక ఇంత కథ ఉందా?

- Advertisement -

పవర్ స్టార్ Pawan Kalyan ఓవైపు సినిమాల్లో మరోవైపు రాజకీయాల్లో బిజీబిజీగా ఉంటున్నారు. ఇక 2024 లో సీఎం అవ్వడమే లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తున్నారు. ఇక ఈ నేపద్యంలోనే తాను ఓకే చేసిన సినిమాలన్నింటినీ తక్కువ టైంలోనే పూర్తి చేసి ఎన్నికల ప్రచారంలో బిజీ అవ్వాలని చూస్తున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు, ఒరిజినల్ గ్యాంగ్స్టర్, వినోదాయ సిత్తం రీమేక్ వంటి సినిమాల్లో నటిస్తున్నారు.. ఇకపోతే ఇప్పుడు మరో విషయం వైరల్ అవుతుంది.. పవన్ కళ్యాణ్ చేతికి పెట్టుకున్న తాబేలు ఉంగరం.. ఆయన ఆ ఉంగరం ఎందుకు పెట్టుకున్నారంటు రకరకాల కథనాలు వెలువడుతున్నాయి.. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది..

Pawan Kalyan
Pawan Kalyan

ఇక ఈ విషయం పక్కన పెడితే పవన్ కళ్యాణ్ ఈ మధ్యనే తన ప్రచార రథానికి వారాహి అనే పేరు పెట్టి ఆ వాహనంతో ప్రజల్లోకి వెళ్లడానికి పూర్తి సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈయన జోరు చూస్తుంటే కచ్చితంగా వచ్చే సంవత్సరం ఎన్నికల్లో జాక్పాట్ కొట్టడం ఖాయం అంటున్నారు పవర్ స్టార్ అభిమానులు. ఇక ఈ విషయం పక్కన పెడితే ఏ ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు అయినా సరే జ్యోతిష్య శాస్త్రాన్ని కచ్చితంగా నమ్ముతుంటారు. జాతకాలు అంటే కొంతమందికి నమ్మకం ఉంటుంది.. ఇక ఆ నమ్మకం పవన్ కళ్యాణ్ కి కూడా ఉంది అని తెలుస్తోంది. ఎందుకంటే ఈమధ్య కాలంలో పవన్ కళ్యాణ్ తన చేతి వేలికి తాబేలు ఉంగరం పెట్టుకొని కనిపిస్తున్నారు. ఆ ఉంగరం జాతక రీత్యా పెట్టుకుంటారని తెలుసు..

Pawan Kalyan Photos

అయితే పవన్ ఆ తాబేలు ఉంగరం పెట్టుకోవడానికి అసలు కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. తాబేలు ఉంగరం పెట్టుకుంటే అన్ని రాశుల వారికి కలిసి వస్తుంది అనుకుంటే పొరపాటే. ఎందుకంటే అవి కొన్ని ప్రత్యేక రాశుల వారికి మాత్రమే కలిసి వస్తుందని నిపుణులు అంటున్నారు.. అలాగే ఈ ఉంగరం పెట్టుకున్న రాశుల వారికి ఆర్థిక ఇబ్బందులు తొలగి, వాళ్ళు చేసే పనుల్లో మంచి సక్సెస్ సాధిస్తారట. అంతేకాకుండా ఉంగరం పెట్టుకోవడం వల్ల నెగటివ్ శక్తి రాకుండా పాజిటివ్ శక్తి ఉంటుందట. అందుకే పవన్ కళ్యాణ్ జ్యోతిష్య నిపుణుల సలహాల ప్రకారం ఈ తాబేలు ఉంగరాన్ని పెట్టుకున్నారు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది..ఇక సోషల్ మీడియాలో పవన్ మాజీ భార్య రేణు దేశాయ్, ఫ్యాన్స్ వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here