Mrunal Thakur ను అలా చూసిన న్యాచురల్ స్టార్ హార్ట్ బ్రేక్..

- Advertisement -

Mrunal Thakur : మృణాల్ ఠాగూర్ పరిచయం అక్కర్లేని పేరు.. సీతారామం సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది ఈ బాలీవుడ్ బ్యూటీ.. పెద్దగా గ్లామర్ షో చేయకుండానే ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గ్రేస్ ను అందుకుంది.. సంప్రదాయ చీర కట్టులో కనిపించి తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది.. అలాంటి ఈ అమ్ముడు ను సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు..

Mrunal Thakur
Mrunal Thakur

సీతారామం సినిమాలో ఈ అమ్మడు ఎంత నేచురల్ గా కనిపించిందో చెప్పనక్కర్లేదు. కొంగు చాటున అందాలను చూపెడుతూ ఈ సొట్ట బుగ్గల సుందరి అందరినీ ఆకట్టుకుంది.. ఈమె నటనకి, చీర కట్టు విధానానికి అందరూ ఫ్లాట్ అయ్యారు. అంతెందుకు ఈ సినిమా ప్రమోషన్ ఎలా టైంలో కూడా కొంతమంది స్టార్ హీరోయిన్లు కూడా.. చీర కట్టుకునే విధానంలో కొన్ని మెలకువలు తనని అడిగి తెలుసుకున్నారని మృణాలే స్వయంగా తెలిపింది..

అటువంటి ఈ అమ్మడు సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. తన సోకుల సోయగాన్ని ఏమాత్రం దాచుకోకుండా.. అందాల ఆరబోత చేస్తూ తన గ్లామర్ డోస్ తో కుర్రకారుకి పిచ్చెక్కిస్తుంది.. మృణాల్ హాట్ హాట్ ఫొటో లను షేర్ చేసి ఇంటర్నెట్ ను మరింత హీటెక్కిస్తోంది.. కాగా మృణాల్ సంప్రదాయ చీర కట్టులో చూసిన ఆమె అభిమానులు బోల్డ్ ఫోజులలో చూడలేకపోయారు. దాంతో సీతారామం సినిమా ఫోటోలను ఒకవైపు గ్లామర్ ఫోటోలను మరోవైపు పోల్చుతూ.. వాటిని చూసి నాని కన్నీళ్లు పెట్టుకుంటున్న ట్రోల్ వీడియో వైరల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

- Advertisement -

నాచురల్ స్టార్ నాని మృణాల్ ఠాగూర్ జంటగా ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ సినిమా పూజ కార్యక్రమాలు కూడా ఘనంగా జరిగాయి. సౌరవ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాను.. వైరా ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై ప్రొడక్షన్ నెంబర్ వన్ గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. చెరుకూరి వెంకట మోహన్, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, మూర్తి కేఎస్ సంయుక్తంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ చిత్రం లవ్ అండ్ ఫామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతుందని సమాచారం. సీతారామం తరువాత తెలుగులో మృణాల్ నటిస్తున్న రెండో చిత్రమిది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here