Mrunal Thakur సినిమాల్లోకి రాకముందు అలాంటి పనులు చేసేదా? బ్యాక్ గ్రౌండ్ మామూలుది కాదుగా!

- Advertisement -

Mrunal Thakur : ఒకే ఒక్క సినిమాతో కోట్లాది మంది కుర్రాళ్ళ మనసులను కొల్లగొట్టిన హీరోయిన్లు ఇండస్ట్రీ లో ఎంతో మంది ఉన్నారు. అందం తో ఎంతమందిని అయినా పడగొట్టొచ్చు కానీ , నటన తో పడగొట్టడం అనేది అంత తేలికైన విషయం కాదు, చాలా అరుదుగా అలాంటి హీరోయిన్స్ దొరుకుతూ ఉంటారు, వారిలో ఒకరే మృణాల్ ఠాకూర్.

Mrunal Thakur
Mrunal Thakur

‘సీతా రామం’ అనే సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీ కి పరిచయమైనా మృణాల్ ఠాకూర్ తొలి సినిమాతోనే ఎవరీ అమ్మాయి ఇంత బాగుంది, ఇంత అద్భుతంగా నటిస్తుందని అందరు అనుకున్నారు. ఆమె గురించి గూగుల్ మొత్తం వెతకడానికి బాగా ప్రయత్నం చేసారు.చివరికి తెలిసింది ఏమిటంటే ఈ సినిమా మృణాల్ కి కేవలం తెలుగు లో మాత్రమే మొదటి సినిమా, హిందీ లో కాదు. ఇది వరకే ఆమె అక్కడ పలు కమర్షియల్ యాడ్స్ తో పాటుగా సీరియల్స్ లో కూడా హీరోయిన్ గా నటించి మంచి పాపులారిటీ ని దక్కించుకుంది.

Mrunal Thakur Photos

ముఖ్యంగా ఈమె హీరోయిన్ గా నటించిన టెలివిజన్ సీరియల్ కుంకుమ భాగ్య భారీ టీఆర్ఫీ రేటింగ్స్ ని దక్కించుకున్న సూపర్ హిట్ సీరియల్స్ లో ఒకటిగా నిలిచింది. బాలీవుడ్ లో భారీ హిట్ అవ్వడం తో ఈ సీరియల్ ని తెలుగు లో కూడా దబ్ చేసి జీ తెలుగు లో ప్రసారం చేసారు. ఇప్పటికిప్పుడు ఈ సీరియల్ చూడాలంటే వెంటనే జీ5 యాప్ ని డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఇందులో మృణాల్ ఠాకూర్ ని చూస్తే ఎలాంటివాడైన ఫ్లాట్ అయ్యిపోవాల్సిందే.

- Advertisement -
Mrunal Thakur Stills

ఈ సీరియల్ కి ముందు కూడా ఆమె పలు టీవీ సీరియల్స్ లో హీరోయిన్ గా నటించింది. అంతే కాదు స్టార్ ప్లస్ లో ప్రసారమయ్యే ‘నాచ్ బలియా’ అనే పాపులర్ డ్యాన్స్ షో లో కూడా మృణాల్ ఠాకూర్ పాల్గొన్నది, ఈ షో లో ఆమె 8 వ స్థానం లో నిల్చింది, వీటితో పాటుగా ‘బాక్స్ క్రికెట్ లీగ్‘ లో కూడా ఆమె పాల్గొన్నది. ఇలా హీరోయిన్ కాకముందు మృణాల్ ఠాకూర్ ఇలాంటి షోస్ ద్వారా బాగా పాపులారిటీ ని సంపాదించింది.

Mrunal Thakur Images
Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here