OTT Releases This Week : ఈ వారం థియేటర్ / ఓటీటీలో వచ్చే సినిమాలు/ సిరీస్​లు ఏంటో తెలుసా..?

- Advertisement -

OTT Releases This Week : 2022 ముగింపు దగ్గరలోనే ఉంది. ఇంకో నాలుగు వారాలైతే ఈ ఏడాదికి గుడ్​బై చెప్పేస్తాం. ఈ సంవత్సరం చాలా సినిమాలు థియేటర్లలో సందడి చేశాయి. అయితే ఈ ఏడాదంతా చిన్న సినిమాల హవాయే నడిచిందని చెప్పొచ్చు. ముఖ్యంగా చిన్న సినిమాలు సైలెంట్​గా విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఇక ఓటీటీలో వచ్చిన మూవీస్​కు ప్రేక్షకులు నీరాజనాలు పట్టారు. భాషాబేధం లేకుండా కంటెంట్ ఉంటే చాలంటూ అన్ని భాషల సినిమాలను ఆదరించారు. మరి చివరి నెల మొదటి వారంలో థియేటర్‌/ ఓటీటీలో అలరించే చిత్రాలు.. వెబ్‌సిరిస్‌లు ఏమున్నాయో ఓ లుక్కేద్దామా..?

ఈ వారం థియేటర్​లో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే..

మరో థ్రిల్లింగ్ మర్డర్ మిస్టరీ చూసేందుకు రెడీయా..?

OTT Releases This Week
OTT Releases This Week

చిత్రం: హిట్‌2 (HIT2); నటీనటులు: అడవి శేష్‌, మీనాక్షి, రావు రమేష్‌, తనికెళ్ల భరణి, పోసాని కృష్ణమురళి తదితరులు; సంగీతం: ఎంఎం శేలేఖ, సురేశ్‌ బొబ్బిలి; నిర్మాత: ప్రశాంతి త్రిపిరినేని; దర్శకత్వం: శైలేష్‌ కొలను; విడుదల: 02-12-2022

భార్యభర్తల మట్టి కుస్తీలో గెలుపెవరిదో తెలుసా..?

చిత్రం: మట్టికుస్తీ (Matti kusthi);

- Advertisement -

నటీనటులు: విష్ణు విశాల్‌, ఐశ్వర్య లక్ష్మి, కరుణాస్‌, గజరాజ్‌;

సంగీతం: జస్టిన్‌ ప్రభాకరన్‌,

నిర్మాత: రవితేజ,

దర్శకత్వం: చెల్ల అయ్యావు,

విడుదల: 02-12-2022

 

మరో డబ్బింగ్‌ సినిమా.. సత్తా చాటేనా..?

చిత్రం: జల్లికట్టు బసవ (jallikattu basava);

నటీనటులు: విజయ్‌ సేతుపతి, బాబీ సింహా, తాన్య రవిచంద్రన్‌, కిషోర్‌, పశుపతి తదితరులు;

సంగీతం: ఇమాన్‌;

దర్శకత్వం: ఆర్‌.పన్నీర్‌ సెల్వన్‌;

విడుదల: 02-12-2022

ఇంతకీ అతనెవరు?

చిత్రం: నేనెవరు (Nenevaru);

నటీనటులు: బాలకృష్ణ కోల, ప్రభాకర్‌, రావు రమేశ్‌, తాగుబో రమేశ్‌, గీతా షా తదితరులు;

సంగీతం: ఆర్‌జీ సారథి;

నిర్మాత: భీమినేని శివ ప్రసాద్;

దర్శకత్వం: నిర్ణయ్‌ పల్నాటి;

విడుదల: 02-12-2022

ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు

నెట్‌ఫ్లిక్స్‌

క్రైమ్‌ సీన్‌ టెక్సాస్‌ కిల్లింగ్‌ ఫీల్డ్స్‌ (వెబ్‌సిరీస్‌) నవంబరు 29

మై నేమ్‌ ఈజ్‌ వెండెట్టా (ఇటాలియన్‌ మూవీ) నవంబరు 30

ట్రోల్‌ (నార్వేజియన్‌ మూవీ) డిసెంబరు 1

జంగిల్‌లాండ్‌ (హాలీవుడ్) డిసెంబరు 1

గుడ్‌బై (హిందీ)  డిసెంబరు 2

 

డిస్నీ+హాట్‌స్టార్‌

విల్లో  (వెబ్‌సిరీస్‌) నవంబరు 30

రిపీట్‌ (తెలుగు) డిసెంబరు 1

డైరీ ఆఫ్‌ ఎ వింపీకిడ్‌: రోడ్రిక్‌ రూల్స్‌ డిసెంబరు 2

ఫ్రెడ్డీ (బాలీవుడ్‌)డిసెంబరు 2

మాన్‌స్టర్‌ (మలయాళం) డిసెంబరు 2

 

జీ5

ఇండియన్‌ లాక్‌డౌన్‌ (బాలీవుడ్‌) డిసెంబరు 2

మాన్‌సూన్‌ రాగా (బాలీవుడ్‌) డిసెంబరు 2

 

ప్రైమ్‌ వీడియో

క్రష్డ్‌ (వెబ్‌సిరీస్‌ సీజన్‌2) డిసెంబరు 2

కాంతార (తుళు) డిసెంబరు 2

వదంతి  (వెబ్‌సిరీస్‌) డిసెంబరు 2

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here