Cinema Gossips : ఛీ..ఛీ.. వీళ్లకు ఇంకా బుద్ధి రాలేదా?

- Advertisement -

Cinema Gossips : ఈ మధ్య సినిమాలు చేసుకోవడం కన్నా కూడా నోరు జారీ వివాదాల్లో చిక్కుకున్న ముద్దుగుమ్మలు ఎక్కువైయ్యారు. అదే ఇప్పుడు ట్రెండ్ అయ్యింది. ఈ మధ్య కొందరు భామలు సినిమా వివాదాలను మాత్రమే కాదు నేషనల్ ఇష్యు లలో తల దూర్చి ట్రోల్స్ తో సతమతమవుతున్నారు. ఆ ముద్దుగుమ్మలు ఎవరో ఇప్పుడు చుద్దాము..

నేషనల్ క్రష్ రష్మిక మందన్న..ఇటీవల విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయిన కాంతార సినిమా ఇంతవరకు చూడనే చూడలేదని చెప్పడం, తనకి మొదటి ఆఫర్ ఇచ్చిన రిషబ్ శెట్టి పేరు చెప్పకుండా ఇంకెవరి పేరో చెప్పడంతో కన్నడ ప్రజలు తమ మనోభావాలు దెబ్బతిన్నాయని, ఆమెపై చాలా వ్యతిరేకత చూపిస్తున్నారు.ఆమెను బ్యాన్ చెయ్యాలని ఇటీవల వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి..త్వరలోనే రష్మికను బ్యాన్ చేసినట్లు అధికారిక ప్రకటన కూడా రానుందని సమాచారం.

Cinema Gossips
Cinema Gossips

సాయిపల్లవి సైతం ఆ మధ్య ఓ నేషనల్ ఇష్యూలో వివాదాన్ని రేపి వార్తల్లో నిలిచింది. ఒక సినిమా ప్రమోషన్స్ లో భాగంగా.. కశ్మీర్ పండిట్ల మారణహోమం, గో హత్యలను లింక్ చేసి మాట్లాడింది. “నాకు వయలెన్స్ అనేది తప్పుగా అనిపిస్తుంది. పాకిస్థాన్‌లో ఉన్న వాళ్లకి మన జవాన్లు టెర్రరిస్ట్‌లా అనిపిస్తారు. ఎందుకంటే మనం హార్మ్ చేస్తామనుకుంటారు. మనకు వాళ్లు అలా కనిపిస్తారు. అని చెబుతూ.. ‘కొన్ని రోజుల క్రితం కాశ్మీర్ ఫైల్స్ అనే సినిమా వచ్చింది కదా. వాళ్లు అందులో కాశ్మీర్ పండిట్లను ఎలా చంపారు అని చూపించారు.

- Advertisement -

మనం వాటిని మత సంఘర్షణలా చూస్తున్నాము అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. దీంతో సాయిపల్లవిని తీవ్ర విమర్శలు చుట్టు ముట్టాయి. హీరోయిన్స్ గా కెరీర్ బాగుండాలంటే నటన, అందం ఉంటే సరిపోదు నోరు కూడా అదుపులో ఉంచుకోవాలి, అనవసర విషయాల్లో తలదూర్చి వివాదాల్లోకి ఎక్కొద్దు అంటూ సినీ ప్రేమికులు అంటున్నారు.

Pooja Hegde / Rashmika Mandanna
Pooja Hegde / Rashmika Mandanna

టాప్ హీరోయిన్లలో ఒకరు..పూజాహెగ్డే. ఎన్ని ఫ్లాప్స్ వస్తున్నా స్టార్ హీరోల సరసన అవకాశాలు అందుకుంటూనే ఉంది ఈ బ్యూటీ. అయితే అమ్మడికి కూడా కాస్త నోటి దురుసు ఎక్కువే. గతంలో ఒక సందర్భంలో పూజా హెగ్డే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘దక్షిణాది ప్రేక్షకులకు బొడ్డు, నడుం అంటే చాలు.. వ్యామోహంలో పడిపోతారు’ అంటూ నోరు జారింది. ఈ వ్యాఖ్యలు వివాదానికి కారణం అయ్యాయి.అప్పుడు ఆమెను సినీ ఇండస్ట్రీ బ్యాన్ చెయ్యాలని కూడా చూసింది..

అలాగే..కన్నడ బ్యూటీ రచితా రామ్,రిచా చద్దా కూడా వివాదాల్లో తలదూర్చారు.చాలా చర్చల అనంతరం వీరికి రిలీఫ్ కలిగింది.ఇక బాలివుడ్ లో కూడా కొంతమంది అలానే ఉన్నారు..ప్రస్తుతం రష్మిక బ్యాన్ విషయం హాట్ టాపిక్ అయ్యింది..ఆమెను బ్యాన్ చేస్తే చాలా మంది నష్ట పొయ్యే ఛాన్స్ ఉంది. మరి రష్మిక సినీ ఇండస్ట్రీ లో ఉంటుందా లేదా అన్నది తెలియాల్సి వుంది..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here