Mega Heros : ఫ్యాన్స్ ను మోసం చేసిన మెగా హీరోలు.. అస్సలు నిజమేంటంటే?

- Advertisement -

Mega Heros : మెగా కుటుంబంలోకి వారసుడు రాబోతున్నాడు.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన తల్లి దండ్రులు కాబోతున్నారనే సంగతి అందరికి తెలుసు.. మెగాస్టార్ చిరంజీవి మరోసారి తాత కాబోతున్నాడు.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తండ్రి కాబోతున్నాడు. మెగా ఫ్యాన్స్ తో పాటు ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సందర్భంగా రానే వచ్చింది.. ఉపాసన తల్లి కాబోతుందని అధికారికంగా ప్రకటించి చాలా రోజులు అవుతుంది. అయితే ఆమెకు బేబీ బంబ్స్ కనిపించలేదు.. నిజంగానే తల్లి అవుతుందా.. మెగా హీరోలు అబద్ధం చెప్పి ఫ్యాన్స్ ను ఫూల్ చేశారనే గుసగుసలు వినిపిస్తున్నాయి..

Mega Heros
Mega Heros

మెగాస్టార్‌ చిరంజీవి కొడుకు రామ్ చరణ్ తండ్రి కాబోతున్న నేపథ్యంలో వారసుడు రాబోతున్నాడని మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవలే ఉపాసన తల్లి కాబోతుంది అంటూ స్వయంగా చిరంజీవి అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.. ఇన్ని రోజుల తర్వాత కూడా ఉపాసన ఇంకా ఒక గర్భవతి అన్నట్లుగా కనిపించడం లేదంటూ చెవులు కొరుక్కుంటున్నారు. సాధారణంగా సెలబ్రెటీలు గర్భం దాల్చిన తర్వాత చాలా నెలల కు అధికారికంగా బయటకు తెలియజేస్తారు. కానీ ఉపాసన విషయంలో కూడా మరో రెండు మూడు నెలల్లోనే డెలివరీ అయ్యే అవకాశం ఉంటుందని చాలా మంది భావించారు. కానీ ఉపాసన ఈ మధ్య వరుసగా ఏదో ఒక ఈవెంట్ లో కనిపిస్తూనే ఉంది. ఆ సందర్భంగా ఆమె బేబీ బంప్‌ ని చూడాలన్నా కనిపించడం లేదంటే కొందరు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు..

chiranjeevi - ram charan upasana
chiranjeevi – ram charan upasana

అంతేకాదు..ఉపాసన గర్భవతేనా లేదంటే సరోగసి విధానం ద్వారా రామ్‌ చరణ్ మరియు ఉపాసన తల్లిదండ్రులు కాబోతున్నారా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేయడం ప్రారంభించారు. కానీ మెగా ఫ్యామిలీకి సంబంధించిన కొందరు మాత్రం ఉపాసన తల్లి కాబోతుందని.. ఇంకా ఆమె డెలివరీ చాలా సమయం ఉంది కనుక బేబీ బంప్‌ కనపడటం లేదని వ్యాఖ్యలు చేస్తున్నారు.. ఇప్పుడు లేకున్నా మరికొద్ది రోజులకైనా కనిపిస్తుంది.. తొందరపడి తప్పుడు ప్రచారాలు చెయ్యొద్దని ఫ్యాన్స్ అంటున్నారని సమాచారం.. ఏది నిజమో.. ఏది అపద్దమో తెలియాల్సి ఉంది.. ప్రస్తుతం మెగా హీరోలు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తున్నారు..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here