Ram Charan – Upasana లకు అబ్బాయి పుడితే బాగుంటుంది : మెగా డాటర్ సుస్మిత

- Advertisement -

Ram Charan – Upasana : టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. అదొక హీరోలను ప్రొడ్యూస్ చేసే ఫ్యాక్టరీ అంటుంటారు అందరు. అయితే మెగా కుటుంబం నుంచి కేవలం హీరోలే కాదు ప్రొడ్యూసర్స్ కూడా ఉన్నారు. ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అర్వింద్ గురించి కాదు మనం ఇక్కడ మాట్లాడుకుంటోంది. మెగా డాటర్ సుస్మిత కొణిదెల గురించి. సుస్మిత గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ అనే ప్రొడక్షన్ కంపెనీ ఏర్పాటు చేసి కంటెంట్ ఉన్న సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తోంది.

Ram Charan - Upasana
Ram Charan – Upasana

సుస్మిత కొణిదెల మంచి అభిరుచి గల నిర్మాతే కాదు.. అంతకన్నా మంచి కాస్ట్యూమ్ డిజైనర్ కూడా. ‘రంగస్థలం’, ‘సైరా నరసింహారెడ్డి’ లాంటి విజయవంతమైన చిత్రాలకు కాస్ట్యూమ్స్‌ అందించి మెప్పించిన సుస్మిత..  తాజాగా తన తండ్రి నటించిన  ‘వాల్తేరు వీరయ్య’లో చిరుని వింటేజ్‌ లుక్‌ లో చూపించింది. ఈ సినిమాలో చిరంజీవి ఊరమాస్ లుక్ లో కనిపిస్తారు. అంతటి మాస్ లుక్ ను చిరుకి తీసుకువచ్చింది తన కూతురు సుస్మితయే. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమా విశేషాలు, మెగా ఫ్యామిలీలో సంక్రాంతి సంబురాలు, తన తమ్ముడు చరణ్ తండ్రి కాబోతున్న సంగతుల గురించి సుస్మిత కొన్ని విషయాలు పంచుకుంది. అవేంటంటే..?

“మా ఫ్యామిలీకి సంక్రాంతి పండుగ చాలా ముఖ్యం. ఈ పండుగకు ఎన్ని పనులున్నా ముందే షెడ్యూల్ చేసుకుని సమయానికి ఇంట్లో ఉండేలా చూసుకుంటాం. కుటుంబంలో అందరం ఉదయం 5గంటల కల్లా లేచి నాన్నగారి ఇంట్లోనే భోగి మంటలు వేసుకుంటాం. ఆ తర్వాత టిఫిన్లు, భోజనాలు అక్కడే. సాయంత్రం వరకు ఆటలాడుకుంటూ.. కబుర్లు చెప్పుకుంటూ సరదాగా గడిపేస్తాం. నాకు గాలిపటాలు ఎగరేయడం సరిగా రాదు. ఈసారైనా నేర్చుకోవాలనుకుంటున్నా.”

- Advertisement -
Ram Charan - Upasana
Ram Charan – Upasana

“ఓ నిర్మాతగా నాన్నతో సినిమా చేయాలని నాకూ ఉంది. నేను ఎప్పుడైనా ఆయణ్ని అడిగితే  ‘మంచి కథ తీసుకురా వెంటనే చేసేద్దాం’ అంటుంటారు. ప్రస్తుతం ఆ కథల వేటలోనే ఉన్నాం. ఈ సంవత్సరం మా ఫ్యామిలీకి చాలా రకాలుగా కలిసొచ్చింది. నాన్న గాడ్ ఫాదర్ మూవీ, చరణ్ ఆర్ఆర్ఆర్.. అంతకంటే గుడ్ న్యూస్ చరణ్‌ – ఉపాసన తల్లిదండ్రులు కానున్నారు. ఈ వార్త కోసం మేము ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నాం. నాకు మేనల్లుడిని అందిస్తాడా.. మేనకోడల్ని ఇస్తాడా అన్నది చూడాలి. మాకైతే ఎవరైనా ఓకే. కాకపోతే మా ఇంట్లో ఇప్పటికే నలుగురు అమ్మాయిలం అయిపోయాం. కాబట్టి అబ్బాయి పుడితే చాలా బాగుంటుంది’’. అని సుస్మిత కొణిదెల చెప్పుకొచ్చింది. 

‘‘ఇక వాల్తేరు వీరయ్య సినిమా గురించి మాట్లాడాలంటే.. డైరెక్టర్ బాబీ కథ చెప్పాక నాతో అన్న మాట ఒకటే.. ‘మేము వింటేజ్‌ చిరంజీవిని చూపించాలనుకుంటున్నాం’ అన్నారు. ‘గ్యాంగ్‌లీడర్‌’, ‘ముఠామేస్త్రి’ తరహాలో ఉండాలనేసరికి పెద్దగా రీసెర్చ్‌ చేయాల్సిన అవసరం లేదనిపించింది. ఎందుకంటే నాన్నని చిన్నప్పటి నుంచి అలా చూస్తూనే పెరిగాం. వీరయ్య పాత్ర, ఆ పోర్టు వాతావరణం, సినిమా కలర్‌ థీమ్‌.. ఇలాంటి అన్ని అంశాల్ని దృష్టిలో పెట్టుకుని నాన్నకు ఎలాంటి కాస్ట్యూమ్స్‌ అయితే బాగుంటాయో ముందుగానే ఓ స్పష్టతకు వచ్చేశా’’.

‘‘ఇక కాస్ట్యూమ్ విషయంలో నాన్న సలహా కూడా తీసుకున్నా. ఎందుకంటే ఆయనకున్న అనుభవం వల్ల సినిమాలో ఆయా సీన్‌కు తగ్గట్లుగా ఎలా కనిపిస్తే బాగుంటుందనేది నాకన్నా తనకే బాగా తెలుసు. ఈ చిత్రంలో తను కట్టుకునే లుంగీలు ఎలా ఉండాలి.. దానికి ఎలాంటి మెటీరియల్‌ వాడాలి.. తను పెట్టుకునే కళ్లద్దాలు ఎలా ఉంటే బాగుంటుంది అన్నవి ఆయనే చెప్పారు. ఈ విషయంలో అమ్మ కూడా తన సలహాలు పంచుకుంది. ఇందులో ఆయన వింటేజ్‌ లుక్‌లో కనిపించినా.. ఆయన కాస్ట్యూమ్స్‌ మొత్తం ఈతరం ప్రేక్షకులు మెచ్చేలా ట్రెండీగానే ఉంటాయి’’.అని చెప్పుకొచ్చింది సుస్మిత కొణిదెల.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here