Anchor Anasuya : ఏంటి.. అనసూయను తల్లి చేశారా?.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్..



Anchor Anasuya : జబర్దస్త్ యాంకర్ అనసూయ మరోసారి తల్లయింది.. అదేంటి ఆమెకు స్కూల్ కు వెళ్లే పిల్లలు ఉన్నారుగా ఇప్పుడు తల్లి అవ్వడమేంటి అని ఆలోచిస్తున్నారా.. కాస్త ఆగండి.. మీరు విన్నది నిజమే కానీ.. అది నిజం కాదు.. ఆమె గర్భవతిగా ఉండే ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.. వాటికి ఆమె ఫ్యాన్స్ తో పాటు జనాలు కూడా రకరకాల కామెంట్లు పెడుతున్నారు.. అసలు నిజమేంటంటే అను తాజాగా నటిస్తున్న ఓ సినిమాలో ఆమె గర్భవతిగా కనిపించునుంది..

Anchor Anasuya
Anchor Anasuya

ఆమె లేటెస్ట్ మూవీలో అనసూయ ప్రెగ్నెంట్ రోల్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన లుక్ ఆమె రివీల్ చేశారు. అది కాస్తా వైరల్ కావడంతో సోషల్ మీడియా షేక్ అవుతుంది. దర్శకుడు కృష్ణవంశీ రంగమార్తాండ చిత్రం తెరకెక్కిస్తున్నారు. ప్రకాష్ రాజ్-రమ్యకృష్ణ ప్రధాన పాత్రలు చేస్తున్నారు. ఇది మరాఠీ హిట్ మూవీ నటసామ్రాట్ రీమేక్. చాలా రోజులుగా షూటింగ్ జరుపుకుంటుంది. కోవిడ్ కారణంగా కొన్నాళ్ళు షూటింగ్ కి వాయిదా పడింది. గత ఏడాది షూటింగ్ తిరిగి స్టార్ట్ అయ్యింది. అయినప్పటికీ ఎందుకో ప్రాజెక్ట్ ఆలస్యం అవుతూ వచ్చింది..

Anchor Anasuya Photos

ఈ మూవీలో శివాత్మిక రాజశేఖర్, అనసూయ, బ్రహ్మానందం సైతం కీలక రోల్స్ చేస్తున్నారు. ఈ చిత్రంలో అనసూయ పాత్రపై ఓ న్యూస్ చాలా కాలంగా చక్కర్లు కొడుతుంది. ఆమె సాహసోపేతమైన దేవదాసిగా కనిపిస్తారనే కథనాలు వెలువడ్డాయి. ఈ పుకార్లకు సంబంధం లేకుండా అనసూయ లుక్ ఉంది.. ఆ ఫోటోలో శివాత్మిక పెళ్లికూతురిగా ముస్తాబై ఉంది. పక్కనే ఆమె తల్లిదండ్రులు ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ ఉన్నారు.

అదే ఫొటోలో అనసూయ కూడా ఉన్నారు. ఆమె బేబీ బంప్ తో కనిపించారు.. రంగమార్తాండ మూవీలో అనసూయ పాత్రపై మరింత ఆసక్తి పెరిగింది. సిల్వర్ స్క్రీన్ పై అనసూయ ఫుల్ బిజీ అయ్యారు. ఆమెకు ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. విశేషం ఏమిటంటే ఎక్కువగా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు ఆమె తలుపు తడుతున్నాయి. పుష్ప, ఖిలాడి, దర్జా చిత్రాల్లో వరుసగా ఆమె నెగిటివ్ రోల్స్ చేశారు. సందీప్ కిషన్ పాన్ ఇండియా మూవీ మైఖేల్ లో అనసూయ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు..

Anchor Anasuya Stills