‘మిస్ శెట్టి..మిస్టర్ పొలిశెట్టి’ మూవీ ఫుల్ రివ్యూ.. నవీన్ పోలిశెట్టి వన్ మ్యాన్ షో!

- Advertisement -

నటీనటులు : నవీన్ పోలిశెట్టి , అనుష్క శెట్టి, నాజర్, జయసుధ, మురళి శర్మ, హర్ష వర్ధన్ , అభినవ్ గోమటం, తులసి తదితరులు.

దర్శకత్వం : మహేష్ బాబు.పి
బ్యానర్ : యూవీ క్రియేషన్స్
సంగీతం : రాధాన్

‘జాతి రత్నాలు’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమా తర్వాత నవీన్ పొలిశెట్టి దాదాపుగా రెండేళ్ల సుదీర్ఘ విరామం తీసుకున్నాడు. మంచి టాలెంట్ ఉన్న కుర్రాడు, ఏమైపోయాడు సడన్ గా అని ప్రతీ ఒక్కరు అనుకున్నారు. ఇక అనుష్క శెట్టి గురించి మన అందరికీ తెలిసిందే. 2018 వ సంవత్సరం లో విడుదలైన ‘భాగమతి ‘ చిత్రం తర్వా మళ్ళీ ఈమె వెండితెర పై కనిపించలేదు. మధ్యలో ‘నిశబ్దం’ అనే సినిమాతో ఓటీటీ ద్వారా ప్రేక్షకులను పలకరించింది కానీ , వెండితెర మీద మాత్రం బాగా గ్యాప్ వచ్చేసింది. అలా భారీ గ్యాప్ తీసుకున్న ఈ ఇద్దరు కలిసి రీసెంట్ గా ‘మిస్ శెట్టి..మిస్టర్ పొలిశెట్టి’ అనే సినిమా చేసారు. ఈ చిత్రం నేడు గ్రాండ్ గా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందా లేదా అనేది ఇప్పుడు మనం ఈ రివ్యూ లో చూడబోతున్నాం.

- Advertisement -
మిస్ శెట్టి..మిస్టర్ పొలిశెట్టి
మిస్ శెట్టి..మిస్టర్ పొలిశెట్టి

కథ :

అన్విత (అనుష్క) అనే అమ్మాయి లండన్ లో ఒక మంచి పేరున్న చెఫ్. ఆమె తన తల్లి చనిపోయిన తర్వాత ఒంటరి తనం ని భరించలేక తనకంటూ ఒక పాప కానీ, లేదా బాబు కానీ కావాలని కోరుకుంటుంది. కానీ అందుకు మగవాడితో ఎలాంటి ఫిజికల్ రిలేషన్ షిప్ ఉండకూడదు అని బలమైన నిర్ణయం తీసుకుంటుంది. అందుకోసం ఆమె ఇండియా కి వస్తుంది, తన కోరికని తీర్చగలిగే మగాడు ఎక్కడ ఉన్నాడబ్బా అని వెతుకుతున్న సమయం లో ఆమెకి స్టాండ్ అప్ కమెడియన్ సిద్ధూ (నవీన్ పోలిశెట్టి) పరిచయం అవుతాడు. ఇతను అన్విత వద్ద అసిస్టెంట్ చెఫ్ గా జాయిన్ అవుతాడు. అలా వాళ్ళిద్దరి మధ్య కాస్త రిలేషన్ ఏర్పడిన తర్వాత అనుష్క తన కోరిక ని సిద్దు తో పంచుకొని నా కోసం ఈ ఒక్క పని చేస్తావా అని అంటుంది. అనుష్క ఆలోచన విని షాక్ కి గురైన సిద్దు ఏమి చేసాడు?, దీని వల్ల వీళ్లిద్దరి మధ్య ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అనేది మిగిలిన స్టోరీ.

విశ్లేషణ :

సినిమా ప్రారంభం కాస్త స్లో గానే ఉంటుంది. అనుష్క మరియు ఆమె తల్లి జయసుధ మధ్య సెంటిమెంట్ సన్నివేశం తో ప్రారంభిస్తాడు డైరెక్టర్ మహేష్ బాబు. కానీ ఆడియన్స్ కి ఆ సన్నివేశాలు చూస్తున్నంత సేపు బోర్ ఫీలింగ్ వచ్చేస్తుంది. ఎప్పుడైతే నవీన్ పోలిశెట్టి పాత్ర కథలోకి ఎంటర్ అవుతుందో అప్పటి నుండి ఆడియన్స్ కి రిలాక్స్ ఫీలింగ్ వస్తుంది. డైరెక్టర్ మహేష్ రాసిన కామెడీ సన్నివేశాలు నవ్వు రప్పించేవి కాకపోయినా కూడా నవీన్ పోలిశెట్టి తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను నవ్వించే ప్రయత్నం చేసాడు. కేవలం నవీన్ పోలిశెట్టి టైమింగ్ వల్లే డిజాస్టర్ ఫస్ట్ హాఫ్ కాస్త పర్వాలేదు బాగానే ఉంది అని అనిపించేలా చేసింది. అనుష్క శెట్టి కూడా తన పాత్రకి తగ్గ న్యాయం చేసింది కానీ, డైరెక్టర్ ఇంకా బలంగా సన్నివేశాలు రాసుకుంటే బాగుండేది అని అనిపించింది.

అతను ఎంచుకున్న పాయింట్ చాలా కొత్త రకంగా ఉంది, ఇలాంటి సినిమాలే ఈమధ్య బాగా ఆడుతున్నాయి, కానీ ఆడియన్స్ ఇలాంటి సినిమాలకు ఎక్కడ బోరింగ్ ఫీల్ అవ్వకూడదు, డైరెక్టర్ అలా బోర్ కొట్టే సన్నివేశాలు చాలానే రాసుకున్నాడు. ఇక సెకండ్ హాఫ్ ప్రారంభం అయ్యాక మొదటి 45 నిమిషాలు నవీన్ పోలిశెట్టి కామెడీ టైమింగ్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విసుంది. కానీ ఆ తర్వాత మళ్ళీ సినిమా డౌన్ అయిపోతుంది. పాటలు ఒక్కటి కూడా ఆకట్టుకునే విధంగా లేవు, క్లైమాక్స్ చాలా వీక్ గా ఉంది. కానీ ఓవరాల్ గా సినిమా మాత్రం టీనేజర్స్ కి పర్వాలేదు, బాగుంది అని అనిపించే రేంజ్ లోనే ఉంటుంది. ఇదంతా కేవలం నవీన్ పోలిశెట్టి కామెడీ టైమింగ్ వల్లే అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. ఒక బిలో యావరేజి సబ్జెక్టు ని హిట్ రేంజ్ కంటెంట్ కి తీసుకెళ్లిన ఘనత నవీన్ పోలిశెట్టి కి మాత్రమే సొంతం.

చివరి మాట :

కుటుంబం తో కలిసి కాసేపు సరదాగా టైం పాస్ చెయ్యగల చిత్రం, నవీన్ పోలిశెట్టి కామెడీ టైమింగ్ అందరికీ నచ్చుతుంది.

రేటింగ్ : 2.75/5

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here