Mrunal Thakur : నక్కతోక తొక్కిన మృణాల్‌.. ఏకంగా చిరంజీవితో రొమాన్స్ చేయనుందిగా..

- Advertisement -

Mrunal Thakur : సీతారామంతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన బ్యూటీ మృణాల్ ఠాకూర్. బాలీవుడ్ లోనూ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న మృణాల్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ఈ భామ ఓ బంపర్‌ ఆఫర్‌ను సొంతం చేసుకున్నట్లు టాక్‌. వశిష్ఠ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. యూవీ క్రియేషన్స్‌ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా దీన్ని రూపొందించనుంది. సోషియో ఫాంటసీ మూవీగా రానున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా మృణాల్‌ను ఎంపిక చేయాలనే ఆలోచనలో ఉన్నారట మేకర్స్‌.

Mrunal Thakur
Mrunal Thakur

ఇందులో హీరోయిన్‌ పాత్రకు కూడా ప్రాధాన్యం ఉండనుందట.. మృణాల్‌ ఆ పాత్రకు పూర్తి న్యాయం చేయగలదని అందుకే ఆమెకు అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం. ఇక చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన కాన్సెప్ట్‌ పోస్టర్‌ ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించింది. ‘విశ్వానికి మించి..’ అంటూ విడుదలైన ఆ పోస్టర్‌లో పంచభూతాలను చూపడంతో ఈ సినిమా భారీ స్థాయిలో ఉంటుందని అంతా భావిస్తున్నారు. దీంతో ఇంత గొప్ప ప్రాజెక్ట్‌లో మృణాల్‌కు అవకాశం వస్తే అది గోల్డెన్‌ ఛాన్స్‌ అవుతుందని అనుకుంటున్నారు.

అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నవంబర్‌లో సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు సమాచారం. చిరంజీవి ‘గోల్డ్‌ బాక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌’ బ్యానర్‌పై ఓ సినిమా చేయనున్నారు. దీనితో పాటే వశిష్ఠతో చేసే చిత్రం కూడా మొదలుపెట్టే అవకాశం కనిపిస్తోంది. ఇక మృణాల్‌ విషయానికొస్తే నాని ‘హాయ్‌ నాన్న’ సినిమాలో నటిస్తోంది. పరశురామ్ దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ సినిమాలోనూ అవకాశం దక్కించుకుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here