మెహ్రీన్ పై పగ తీర్చుకున్న మాజీ ప్రియుడు.. వైరలవుతోన్న ఫొటోలు

- Advertisement -

టాలీవుడ్ హీరోయిన్ మెహ్రీన్ ఇప్పటికే ఎంగేజ్‌మెంట్ చేసుకొని పెళ్లి సమయానికి డ్రాప్ అయిన సంగతి తెలిసిందే. గతంలో హర్యానా మాజీ సీఎం భజన్ లాల్ మనవడు భవ్య బిష్ణోయ్ ని ప్రేమించి ఆయనతో నిశ్చితార్థం కూడా చేసుకుంది హీరోయిన్ మెహ్రీన్. కానీ అంతలోనే షాకిచ్చింది మెహ్రీన్. ఎంగేజ్‌మెంట్‌ను రద్దు చేసుకున్నట్లు సంచలన ప్రకటన చేసింది. ఇక నుంచి భవ్యతో గానీ, ఆయన కటుంబ సభ్యులతో గానీ తనకు ఎలాటి సబంధం ఉండబోదని స్పష్టం చేసింది. అయితే అందుకు గల కారణాలను మాత్రం వెల్లడించలేదు.

మెహ్రీన్
మెహ్రీన్

ఏదో బలమైన కారణం ఉండడం వల్లే మెహ్రీన్ ఈ పెళ్లిని రద్దు చేసుకుందని ఆమె అభిమానులు సపోర్ట్ చేశారు. అయితే మెహ్రీన్ నిశ్చితార్థం చేసుకొని బ్రేకప్ చెప్పిన భవ్య బిష్ణోయ్ తాజాగా మరొకరితో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఐఏఎస్ అధికారి పరి బిష్ణోయ్ తో భవ్య బిష్ణోయ్ నిశ్చితార్థం జరిగింది. త్వరలో వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారు. ఈ విషయాన్ని భవ్య బిష్ణోయ్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఇలా మెహ్రీన్ పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలు మరోసారి హాట్ టాపిక్ అయ్యాయి. టాలీవుడ్‌లో మీడియం రేంజ్ సినిమాల్లో నటిస్తూ తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది మెహ్రీన్. పాలమీగడ లాంటి అందాలతో వెండితెరపై తన మార్క్ చూపెడుతోంది ఈ ముద్దుగుమ్మ. కెరీర్ నిలబెట్టుకునేందుకు ఎంతో హార్డ్ వర్క్ చేస్తోంది.

ప్రియుడు
ప్రియుడు

నటన పరంగా భేష్ అనిపించుకున్న ఈ అందాల సోయగం.. కెమెరా ముందు తన గ్లామర్ ఒలకబోయడంలో కూడా సక్సెస్ అయింది. మెహ్రీన్ స్క్రీన్ ప్రెజెన్స్ చూసి తెలుగు ప్రేక్షకలోకం ఫిదా అవుతోంది. ఇన్ని రోజులు సిల్వర్ స్క్రీన్ పై తన లేలేత అందాలతో అట్రాక్ట్ చేసే మెహ్రీన్.. సడెన్ గా షాకింగ్ లుక్ లో దర్శనమిచ్చింది. బొద్దుగా ఉన్న ఈ ముద్దుగుమ్మ బక్కచిక్కి కనిపించడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. మొన్నటివరకు బాగానే ఉందిగా.. ఇంతలో మెహ్రీన్ కి ఏమైంది అని తెగ డిస్కస్ చేసుకుంటున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here