రచ్చలోకి మహేష్ బాబును ను లాగిన అనసూయ .. ఇది మామూలు కెలకటం కాదు భయ్యా..!!

- Advertisement -

టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ,యాంకర్ కమ్ నటి అనసూయ భరద్వాజ్ ల మధ్య గత కొన్నాళ్లుగా వివాదం నడుస్తున్న విషయం మనందరికి తెలిసిందే. విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి సినిమా సమయంలో మొదలైన వీరి గొడవ ఇప్పటికీ కూడా అలాగే కొనసాగుతూ ఉంది. అనసూయ కూడా పరోక్షంగా విజయ్ దేవరకొండని ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో ట్వీట్లతో విరుచుకు పడుతుంది. అనసూయ, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో ఒక పెద్ద యుద్ధం జరుగుతూ ఉంది. ఇది ఇలా ఉంటే తాజాగా విజయ్ దేవరకొండ నటింస్తున్న ఖుషి సినిమా పోస్టర్ విషయంలో మరోసారి విమర్శిస్తూ పోస్ట్ పెట్టింది.

అనసూయ
అనసూయ

అదీ కాస్త రచ్చ రచ్చ అయింది. విజయ్ కు ఈ విషయంలో మద్దతు పెరుగుతోంది. Anasuya కూడా తగ్గేదే లే అంటూ వరుస ట్వీట్లు చేస్తోంది. ఇక అనసూయకు పగిలిపోయేలా కౌంటర్ ఇచ్చాడు హరీశ్ శంకర్. కావాలని ది వచ్చేలా ట్వీట్ చేశాడు. ఇదీ హరీష్ శంకర్ ట్వీటు.! పోలా.! అదిరిపోలా.! ‘ది మోస్ట్ డిజర్వ్‌డ్ మ్యాన్ ఆఫ్ అవర్ జనరేషన్స్..’ అనడం కొంత అతిశయోక్తి అయినా, అది హరీష్ శంకర్ మార్కు ‘పొగడ్త’ అని సరిపెట్టుకోవాల్సిందే.దీంతో అనసూయకు ఏం చేయాలో అర్థం కాక మరోక ట్వీట్ చేసింది. ఇక, ‘THE’ చుట్టూ కొంత రగడ చోటు చేసుకుంది. అది కూడా anasuya భరద్వాజ్ కారణంగా.

Anasuya VIjay deverakonda

‘ఖుషీ’ సినిమా పోస్టర్‌లో ‘The Vijay Deverakonda’ అని పేర్కొనడాన్ని అనసూయ భరద్వాజ్ తప్పు పట్టింది. విజయ్ దేవరకొండ పేరు ప్రస్తావించలేదుగానీ, నేరుగా అతనికి తగిలేలానే స్పందించింది సోషల్ మీడియాలో. మరోపక్క, అనసూయ కూడా తగ్గేదే లే.. అంటోంది. ‘అంటే, ఇంతమంది వత్తాసు పలికితేగానీ, పనవ్వదన్నమాట. అతడు సినిమాలో బుజ్జిని పార్దు అడిగినట్లు..’ అంటూ ఓ డైలాగ్ పేల్చింది. దీంతో మహేష్ అభిమానులు కూడా అనసూయపై విరుచుకుపడుతున్నారు. మధ్యలో మా హీరో డైలాగు ఎందుకు పెట్టావంటున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here