ఎల్లో చుడీదార్లో శ్రీలీల నాటీ పోజులు.. అదరహో అంటూ నెటిజన్ల కామెంట్లు

- Advertisement -

టాలీవుడ్లో మోస్ట్ హాపెనింగ్ హీరోయిన్లలో ఫస్ట్ ప్లేస్లో ఉన్న బ్యూటీ శ్రీలీల. ప్రస్తుతం ఈ భామదే ట్రెండ్ అంతా. ఏ సినిమాలో చూసినా ఈ బ్యూటీయే కనిపిస్తోంది. అరడజను సినిమాలు షూటింగ్స్ జరుగుతోంటే.. మరో నాలుగైదు సినిమాలు లైన్లో ఉన్నాయి. ఈ బ్యూటీ ఇటీవలే విజయ్ దేవరకొండతో కలిసి నటిస్తున్న సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ ఈవెంట్లో శ్రీలీల ట్రెడిషనల్ లుక్లో కనిపించింది. ఈ ఈవెంట్కు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఎల్లో కలర్ చుడీదార్లో శ్రీలీల చాలా అందంగా కనిపించింది.

శ్రీలీల
శ్రీలీల

ట్రెడిషనల్ లుక్లో అదరగొట్టింది. ఈ ఫొటోలు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. ఈ బ్యూటీ తాజా ఫొటోల్లో క్యూట్ అండ్ నాటు పోజులతో సందడి చేసింది. తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో అభిమానులను ఫిదా చేసింది. ఈ ఫొటోలు చూసి కుర్రాళ్లు శ్రీలీలపై మనసు పారేసుకుంటున్నారు. ఈ బ్యూటీ అందం చూసి మెస్మరైజ్ అవుతున్నారు. శ్రీలీలనా మజాకా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

శ్రీలీల నాటీ
శ్రీలీల నాటీ

శ్రీలీల పెళ్లిసందడి సినిమాతో టాలీవుడ్లో అడుగుపెట్టింది. ఆ సినిమా ఫ్లాప్ అయినా ఈ బ్యూటీకి మాత్రం టాలీవుడ్లో అవకాశాలు మాత్రం వరుసకట్టాయి. ఈ భామ తన రెండో సినిమా మాస్ మహారాజ రవితేజతో కలిసి ధమాకాలో నటించింది. ఈ చిత్రంతో ఏకంగా వంద కోట్ల క్లబ్లో చేరిపోయింది. ఈ మూవీ తర్వాత శ్రీలీలకు వరసుగా ఆఫర్లు వచ్చాయి.

- Advertisement -
Sreeleela

ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో ఎనిమిది ప్రాజెక్టులు ఉన్నాయి. ప్రస్తుతం అవన్నీ సెట్స్పైనే ఉన్నాయి. ఉస్తాద్ భగత్సింగ్, SSMB28, NBK108, Boyapati Rapo20, PVT04, అనగనగా ఒకరాజు, జూనియర్ వంటి చిత్రాలు ఉన్నాయి. ఈ బ్యూటీ నితిన్తో కూాడా ఓ సినిమా చేస్తోంది.

Sreeleela

ఓవైపు సినిమా షూటింగ్సులో బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలో తన హవా సాగిస్తోంది శ్రీలీల. ఎప్పటికప్పుడు ఫొటోషూట్స్ చేస్తూ తన అందంతో అభిమానులను మెస్మరైజ్ చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ ట్రెడిషనల్ ఔట్ ఫిట్లో కుర్రాళ్ల గుండెల్ని కొల్లగొట్టింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here