‘భోళా మానియా’ సాంగ్ లో మెగాస్టార్ స్టెప్స్ అదుర్స్..కానీ అదొక్కటే మిస్ అయ్యింది!

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటిస్తున్న ‘భోళా శంకర్’ సినిమా ఆగష్టు 11 వ తేదీన విడుదల అవ్వబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా తమిళం లో సూపర్ హిట్ గా నిల్చిన అజిత్ ‘వేదలమ్’ సినిమాకి రీమేక్. ఫ్లాప్స్ సినిమాల దర్శకుడు మెహర్ రమేష్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. మణిశర్మ కొడుకు మహతి సాగర్ ఈ చిత్రానికి సంగీతం అందించగా,తమన్నా హీరోయిన్ గా నటించింది.

భోళా మానియా

ఇక నేషనల్ అవార్డు విన్నర్ కీర్తి సురేష్ ఈ చిత్రం లో మెగాస్టార్ కి చెల్లెలుగా నటించింది. ఇక ఈ సినిమాలో వచ్చే టైటిల్ సాంగ్ ‘భోళా మానియా’ ఫుల్ లిరికల్ వీడియో సాంగ్ కాసేపటి క్రితమే విడుదల అయ్యింది. ఇందులో మెగాస్టార్ చిరంజీవి మాస్ స్టెప్స్ ఫ్యాన్స్ ని బాగా ఆకట్టుకున్నాయి. లిరిక్స్ కూడా మెగాస్టార్ మాస్ కి తగ్గట్టుగానే ఉన్నాయి.

చిరంజీవి

కానీ మహతి సాగర్ అందించిన ట్యూన్ మాత్రం చాలా పాతది గా అనిపించింది. ఈ సినిమాలో మూడు పాటలు అదిరిపోయాయి అని ఇండస్ట్రీ వర్గాల్లో నిన్నటి వరకు వినిపించిన వార్త, ఆ మూడు పాటల్లో ఈ సాంగ్ లేదు కదా అని ఫ్యాన్స్ సోషల్ మీడియా లో అడుగుతున్నారు. ఇక ఈ సాంగ్ ని మెగాస్టార్ చిరంజీవి తన మాస్ స్టెప్స్ తోనే సూపర్ హిట్ చేస్తాడని, మెగాస్టార్ మీద నమ్మకం ఉంచమని అంటున్నారు కొంతమంది సీనియర్ మెగా ఫ్యాన్స్.

- Advertisement -

‘వాల్తేరు వీరయ్య’ లో పాటలకు కూడా మొదట్లో ఇలాంటి రెస్పాన్స్ వచ్చిందని, కానీ సినిమా విడుదల తర్వాత వెండితెర మీద మెగాస్టార్ చిరంజీవి తన మ్యాజికల్ స్టెప్పులతో ప్రేక్షకులను మైమర్చిపోయేలా చేసాడని , భోళా శంకర్ కూడా అలాగే ఉండబోతుందని అంటున్నారు ఫ్యాన్స్. మరి ఇందులో ఎంత మాత్రం నిజం ఉందో తెలియాలంటే ఆగష్టు వరకు ఆగాల్సిందే.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here