షాకింగ్ న్యూస్.. మెగాస్టార్ చిరంజీవికి క్యాన్సర్

- Advertisement -

మెగాస్టార్‌ చిరంజీవి శనివారం కీలక వ్యాఖ్యలు చేశారు. తాను క్యాన్సర్‌ బారినపడ్డట్లు తెలిపారు. ముందుగా గుర్తించి చికిత్స తీసుకోవడం వల్లే తాను బతికానన్నారు. క్యాన్సర్‌ వచ్చిందని చెప్పేందుకు ఎలాంటి భయం లేదని చెప్పారు. ఏఐజీలో కొలనోస్కోపీ చేయించుకొని క్యాన్సర్‌ నుంచి బయటపడ్డానన్నారు.

మెగాస్టార్ చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి గురించి ప్ర‌త్యేకించి చెప్ప‌న‌వ‌స‌రం లేదు. ఉత్త‌రాదిలో తెలుగు సినిమాల‌కు అంత‌గా గుర్తింపు లేని రోజుల్లో.. చిరంజీవి త‌న మూవీస్‌తో తెలుగు సినిమాను జాతీయ స్థాయిలో నిల‌బెట్టాడు. ఇండియాలోనే కోటీకి పైగా రెమ్యున‌రేష‌న్ అందుకున్న మొద‌టి హీరోగా చిరు రికార్డు సృష్టించాడు. ‘ప్రాణం ఖ‌రీదు’ సినిమాతో సినీ ప్ర‌స్థానం మొద‌లు పెట్టారు. ఎన్నో ఇండ‌స్ట్రీ హిట్లు మ‌రెన్నో బ్లాక్ బాస్ట‌ర్ చిత్రాల‌లో న‌టించి కోట్ల‌లో అభిమానుల‌ను సంపాదించుకున్నాడు. టాలీవుడ్‌లో 10కోట్ల క్ల‌బ్‌లో అడుగుపెట్టిన మొద‌టి హీరోగా రికార్డు సృష్టించాడు. ఇక‌ సౌత్ నుండి ఆస్కార్ అవార్డుల ఫంక్ష‌న్‌కు ఆహ్వానించబడిన మొట్టమొదటి హీరోగా కూడా మెగాస్టార్ నిలిచాడు.

చిరంజీవి ఇప్ప‌టివ‌ర‌కు 152 సినిమాల్లో న‌టించాడు. ప్రస్తుతం మూడు సినిమాల‌ను సెట్స్‌పై ఉంచాడు. ఇక ఈ 152 సినిమాల్లో అప‌జ‌యాల‌కంటే విజ‌యాలే ఎక్కువ‌గా ఉన్నాయి. ముఖ్యంగా ఏ హీరో కూడా ట‌చ్ చేయ‌ని విధంగా ఈయ‌న సినిమాల రికార్డులు ఉండేవి. మొద‌టి 5 కోట్లు, 10 కోట్లు, 30 కోట్ల షేర్‌ను వ‌సూళ్ చేసిన హీరోగా చిరంజీవి అరుదైన రికార్డును క్రియేట్ చేశాడు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here