శివుడిగా ప్రభాస్.. భక్త కన్నప్పగా మంచు విష్ణు.. క్రేజీ కాంబో

- Advertisement -

బాహుబలి తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. ప్రస్తుతం తాను నటించిన సినిమాలన్నీ పాన్ ఇండియా లెవల్లోనే విడుదల అవుతున్నాయి. ప్రభాస్ త్వరలో సలార్ సినిమాతో ప్రేక్షకులను అలరించబోతున్నాడు. ప్రభాస్ ఇప్పటికే ఆదిపురుష్ సినిమాలో రాముడిగా నటించారు. మరో సారి దేవుడి అవతారమెత్తబోతున్నట్లు తెలుస్తోంది. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన భక్త కన్నప్ప సినిమాను ఇటీవల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ అదిరిపోయే అప్డేట్ను మంచు విష్ణు రివీల్ చేశారు. పాన్ ఇండియా హీరో ప్రభాస్ ఈ చిత్రంలో శివుడిగా అతిథి పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని మంచు విష్ణు సోషల్ మీడియా వేదికగా ట్విట్టర్లో కన్ఫర్మ్ చేశారు.

ప్రభాస్
ప్రభాస్

ఈ చిత్రంలో ప్రభాస్ పాత్ర గురించి మంచు విష్ణు చెప్పకుండానే చెప్పినట్లు.. హరిహర మహాదేవంటూ రాసుకొచ్చారు.. ఇది చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ అతిథి పాత్ర శివుడే అని ఫిక్స్ అయ్యారు. ఒకవేళ ఇదే నిజమైతే ప్రభాస్ మూడో సారి దేవుడి పాత్రలో కనిపించే అవకాశం అభిమానులకు దక్కుతోంది.. ప్రభాస్ ఇప్పటికే ఆది పురుష్ చిత్రంలో రాముడు గా కనిపించగా కల్కీ లో విష్ణుమూర్తిగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. విష్ణు ఎన్నో ఏళ్ల క్రితమే భక్తకన్నప్ప కథను తెరకెక్కించాలని ప్రయత్నించారు. కానీ ఇప్పటికి కుదిరింది. ఈ సినిమాలో నుపుర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ నిమిత్తం చిత్ర బృందం న్యూజిలాండ్ కి వెళ్ళబోతున్నట్లు మంచు విష్ణు తెలియజేశారు. దాదాపుగా రూ.150 కోట్ల బడ్జెట్తో ఈ సినిమా తెరకెక్కిస్తూ ఉన్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here