3 రోజుల్లో 400 కోట్లు.. ‘జవాన్’ సునామి ఇప్పట్లో ఆగేలా లేదు.. తెలుగు వెర్షన్ లో ఎంత వసూళ్లు వచ్చాయో తెలుసా..?

- Advertisement -

రీసెంట్ సమయం లో సూపర్ స్టార్ రజినీకాంత్ ‘జైలర్’ మూవీ తో ఎలాంటి సునామి ని సృష్టించాడో మనమంతా చూసాము. ఈ సునామి సెగ బాక్స్ ఆఫీస్ వద్ద ఇంకా చల్లారకముందే బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ ‘జవాన్’ సినిమాతో మరో బాక్స్ ఆఫీస్ సునామి ని సృష్టించాడు. మూడు రోజుల క్రితం తెలుగు, తమిళం మరియు హిందీ భాషల్లో విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల పరంగా సరికొత్త బెంచ్ మార్క్స్ ని నెలకొల్పుతూ ముందుకు దూసుకుపోతుంది.

మొదటి రోజు దాదాపుగా 129 కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టిన ఈ సినిమా, రెండవ రోజు కూడా అదే రేంజ్ వసూళ్లను రాబట్టింది. ఇక మూడవ రోజు అయితే మొదటి రోజుకంటే ఎక్కువ గ్రాస్ వసూళ్లను రాబట్టి కేవలం మూడు రోజుల్లోనే 400 కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టింది. ఇది ఆల్ టైం రికార్డుగా చెప్తున్నారు ట్రేడ్ పండితులు.

తెలుగు లో కూడా ఈ సినిమా వసూళ్లు ఊహకి అందని రేంజ్ లో ఉన్నాయి. ట్రేడ్ పండితుల లెక్క ప్రకారం ఈ సినిమాకి ఇప్పటి వరకు కేవలం తెలుగు వెర్షన్ నుండి 30 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయట. అంటే దాదాపుగా 15 కోట్ల రూపాయిల షేర్ అన్నమాట. ఇది ఇప్పటి వరకు విడుదలైన హిందీ దబ్ సినిమాలలో ఆల్ టైం రికార్డు అనే చెప్పాలి. నైజాం ప్రాంతం లో అయితే ఈ సినిమాకి వస్తున్న వసూళ్లు రీసెంట్ గా విడుదలైన తెలుగు స్టార్ హీరోల సినిమాలకు కూడా రాలేదు.

- Advertisement -

ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వంటి సెంటర్ లో కేవలం మూడు రోజుల్లోనే 50 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయంటే ఈ చిత్రం సృష్టిస్తున్న విద్వంసం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం, నాలుగు రోజుల్లో ఈ చిత్రం 500 కోట్ల రూపాయిల గ్రాస్ మార్కుని అందుకునే అవకాశం ఉందట.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here