హాలీవుడ్‌ హీరోలా మహేశ్‌బాబు న్యూ లుక్.. రాజమౌళి కోసం మరీ ఇంతలా మారిపోయాడా?



మహేశ్​ బాబు గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. హాలీవుడ్‌ నుంచి తప్పిపోయి టాలీవుడ్‌లో తిరుగుతున్న యంగ్‌ హీరోలా కనిపిస్తూ మెస్మరైజ్‌ చేస్తుంటాడు. జనరేషన్‌తో సంబంధం లేకుండా అన్ని వయసుల వారు ఆయనని అభిమానిస్తుంటారు. 50 ఏళ్ల వయసుకు దగ్గర్లో ఉన్న ఆయన టీనేజ్‌ కుర్రాడిలా వన్నెతెరగని అందంతో అట్రాక్ట్‌ చేస్తుంటాడు. ఇక ఈ మధ్య మహేశ్‌ లుక్‌ మార్చేశారు. త్రివిక్రమ్‌ కోసం నోట్లో బీడీ ముక్క పెట్టి ఊర మాస్‌ లుక్‌ కనిపించిన మహేశ్‌.. తాజాగా ఆ జుట్టును ఉంగరాలు తిప్పి సాఫ్ట్‌ లుక్‌లో అదరగొట్టాడు. ఆయనకి సంబంధించిన లేటెస్ట్ ఫోటోలను తాజాగా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దీంతో ఈ వయసులో ఇంతలా ఎలా మెయిన్‌టెయిన్‌ చేస్తున్నారు అంటూ అభిమానులు తెగ కామెంట్స్‌ పెడుతున్నారు.

సూపర్ స్టార్ మహేశ్​ బాబు సోషల్ మీడియాలో అంతగా యాక్టివ్​గా ఉండరు. కానీ అప్పుడప్పుడూ ఆయనకి సంబంధించిన లేటెస్ట్‌ ఫోటోషూట్‌ల అప్డేట్స్ పెడుతుంటారు. తాజాగా స్టైలిష్ లుక్‌లో ఉన్న ఫొటోలను ఇన్​స్టాలో షేర్ చేశారు మహేశ్‌ బాబు. వాటిలో రింగుల జుట్టుతో చిరు నవ్వులు చిందిస్తూ మరింత అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తున్నారు. బ్రాండెడ్​ జీన్స్ షర్ట్​లో మిల్క్ బాయ్​లా మెరిసిపోతున్నారు.

mahesh babu

ఈ ఫొటోలను చూసి ఆయన భార్య నమ్రత Ufffff! అని కామెంట్ పెట్టింది. హీరోయిన్​ కీర్తి సురేశ్​.. వాహ్​ అంటూ కామెంట్​ చేశారు. మిగిలిన సెలబ్రెటీలు సైతం పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఇక అభిమానుల సంగతి చెప్పక్కర్లేదు. వారంతా ఓ రేంజ్‌లో కామెంట్స్ పెడుతున్నారు. మహేశ్‌ న్యూలుక్‌కి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి.

mahesh babu movie

. ఈ చిత్రానికి గుంటూరు కారం అని టైటిల్​ ఖరారు చేశారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో యాక్షన్ అడ్వెంచర్ మూవీని మహేశ్​ చేయబోతున్నారు. అయితే మహేశ్‌ బాబు ఈ సినిమా కోసమే ఇలా న్యూ లుక్‌లో కనిపించారంటూ నెట్టింట వార్తలు గుప్పుమంటున్నాయి.