షాకింగ్ నిర్ణయం తీసుకున్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్.. ఇంక అందుకు గుడ్‌ బై చెప్పనుందా..?తాజాగా కాజోల్ తన అభిమానులకు ఊహించని షాక్ ఇచ్చింది. నెట్టింట ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఆమె.. సోషల్ మీడియానుంచి బ్రేక్ తీసుకుంటున్నట్లు చెప్పి ఆశ్చర్యపరిచింది. అంతేకాదు ఇంతకాలం ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన ఫొటో, వీడియోలన్నీ డిలిట్ చేయడం గమనార్హం. ‘ప్రస్తుతం నా లైఫ్‌లో అత్యంత కఠినమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నా. కాబట్టి.. టేకింగ్ ఏ బ్రేక్ ఫ్రమ్ సోషల్ మీడియా’ అంటూ నెట్టింట ఓ పోస్ట్ పెట్టింది. అయితే ఆమె పరిస్థితి గురించి కానీ దాని కారణాల గురించి కానీ ఆమె ఏ వివరాలు వెల్లడించలేదు. దీంతో ఆమె అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. ఆమె పెట్టిన నోట్‌ను వైరల్‌ చేస్తూ ‘గెట్‌ వెల్‌ సూన్‌’ అని కొందరు పోస్ట్‌ చేస్తుండగా మరికొందరు మాత్రం ‘ఇదంతా ఓ పెద్ద స్టంట్. ప్రమోషన్స్ కోసమే ఇలాంటి ట్రిక్స్ ప్లే చేస్తారు’ అంటూ నెగెటీవ్ కామెంట్స్ చేస్తున్నారు.

ప్రస్తుతం ఆమె ‘ది గుడ్ వైఫ్’ అనే షో చేస్తోంది. దాని ప్రొమోషన్ లో భాగంగానే ఈ పోస్ట్ పెట్టిందని కొందరు అంటున్నారు. ఎందుకంటే ఆ వెబ్ షో దర్శకుడు పి మల్హోత్రా ఈమె పోస్ట్‌కి రిప్లై ఇస్తూ ఎప్పుడు ది గుడ్ వైఫ్ ట్రైలర్ వస్తోంది అని అడిగాడు. దీంతో ఆ షో ప్రచారంలో భాగంగానే ఇలా చేసిందేమో అని అంటున్నారు. మరి దీనిపై స్పష్టత రావాలి అంటే తర్వాతి అప్డేట్‌ కోసం వేచి చూడాల్సిందే.