Mahesh Babu నయనతార తో సినిమా చెయ్యకపోవడం వెనుక ఇంత పెద్ద కథ ఉందా!

- Advertisement -

టాలీవుడ్ లో సూపర్ స్టార్ Mahesh Babu కి ఉన్నటువంటి క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.ఆయనతో కలిసి నటించాలని ప్రతీ హీరోయిన్ కి ఉంటుంది, దాదాపుగా సౌత్ లో ఉన్న హీరోయిన్స్ అందరూ మహేష్ బాబు తో కలిసి నటించారు ఒక్క నయనతార తప్ప.ఈ కాంబినేషన్ ని చూసేందుకు ప్రేక్షకులు మరియు అభిమానులు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నారు.కానీ ఇప్పటి వరకు ఈ కాంబినేషన్ సెట్ కాలేదు.

Mahesh Babu
Mahesh Babu

గతం లో వీళ్లిద్దరి కాంబినేషన్ లో మూడు సినిమాలు మిస్ అయ్యాయి. మహేష్ కెరీర్ ని మలుపు తిప్పి ఆయనని సూపర్ స్టార్ ని చేసిన పోకిరి సినిమాని అభిమానులు మరియు తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎప్పటికి మర్చిపోలేదు. ఈ సినిమాలో హీరోయిన్ రోల్ కోసం తొలుత నయనతార నే సంప్రదించాడట పూరీ జగన్నాథ్, కానీ ఆ సమయం లో నయనతార డేట్స్ ఖాళీగా లేకపోవడం తో అప్పుడే ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఇలియానా ని తీసుకున్నారు.

Mahesh Babu
Mahesh Babu

ఇక ఆ తర్వాత మహేష్ బాబు మరియు సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో తెరకెక్కిన ‘అతిథి’ సినిమాలో కూడా నయనతారనే హీరోయిన్ గా అనుకున్నారట.సురేందర్ రెడ్డి ఆమెని చెన్నై లో కలిసి కథ కూడా వినిపించాడట, అయితే ఆమె కథలో కొన్ని కీలకమైన మార్పులు చేయాల్సిందిగా కోరిందట, అందుకు సురేందర్ రెడ్డి ఒప్పుకోలేదు, అలా మహేష్ – నయన్ కాంబినేషన్ మరోసారి మిస్ అయ్యింది.

- Advertisement -

ఆ తర్వాత వరుస ఫ్లాప్స్ తో కొట్టుమిట్టాడుతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో మరో ల్యాండ్ మార్క్ గా నిల్చిన చిత్రం ‘దూకుడు’. ఈ సినిమాలో కూడా హీరోయిన్ రోల్ కోసం నయనతార అని అనుకున్నాడట శ్రీను వైట్ల, కానీ మహేష్ ఆమెకి బదులుగా సమంత ని సూచించాడట. డైరెక్టర్ కూడా ఆమె వైపే మొగ్గు చూపాడు. అలా ఈ క్రేజీ కాంబినేషన్ మూడు సార్లు మిస్ అయ్యింది, భవిష్యత్తులో కూడా ఈ కాంబినేషన్ ని చూసే అవకాశం లేదని అంటున్నారు విశ్లేషకులు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here