Malavika Mohanan : రణ్‌వీర్ సింగ్.. విక్కీ కౌశల్.. బెడ్ పై హాట్ హీరో ఎవరంటే.. నోరు జారిన బోల్డ్ బ్యూటీ



Malavika Mohanan మోడల్‌గా, పలు బ్రాండ్ల యాడ్స్‌లో నటిస్తూ కెరీర్ ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ మలయాళ హీరో దుల్కర్ సల్మాన్‌తో నటించిన పట్టమ్ పొలే అనే మూవీతో సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఇళయదళపతి విజయ్‌తో నటించిన మాస్టర్‌ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. మాస్టర్ ఇచ్చిన కిక్‌తో వరుస సినిమాలు చేస్తోంది.

కేవలం సినిమాల్లోనే కాదు ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా ఫేమస్. తన హాట్ హాట్ అందాలను కుర్రకారుకు వడ్డిస్తూ వాళ్ల మతి పోగొట్టేస్తోంది. ఈ బ్యూటీ స్టన్నింగ్ ఫిగర్‌కు.. మైండ్‌బ్లోయింగ్ పోజులకు, మెస్మరైజ్ చేసే చూపులకు యువకులు ఫిదా అవుతున్నారు. హాట్ హాట్ పరువాలతో రెచ్చగొట్టే పోజులిస్తూ ఈ భామ సోషల్ మీడియాలో హీట్ పుట్టిస్తోంది.

Malavika Mohanan
Malavika Mohanan

ఈ బ్యూటీ అందాలే కాదు మాటలు కూడా నాటీయే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ బ్యూటీ నోరు జారింది. ఇప్పుడు ఈ బ్యూటీ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిన్నటి దాకా మాళవిక అందాలకు పడీపడీ ఫిదా అయిన కుర్రకారు ఇప్పుడు ఈ బ్యూటీని తెగ ట్రోల్ చేస్తున్నారు. మాళవిక.. నాటీ అని తెలుసు కానీ ఇంత బోల్డ్ అని అనుకోలేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..?

ఆ ఇంటర్వ్యూలో యాంకర్.. బియర్డ్ ఉన్న హీరోలు రణ్‌వీర్ సింగ్, విక్కీ కౌశల్‌లో ఎవరంటే మీకు ఇష్టం అని అడిగారు. అప్పుడు మాళవిక. నాకు బెడ్‌పై ఎవరు ఎక్కువ హాట్ అంటూ ఆన్సర్ ఇవ్వబోగా యాంకర్ వెంటనే కల్పించుకుని తానడిగింది బియర్డ్ ఉన్న హీరో అని.. బెడ్‌పై కాదు అని క్లారిటీ ఇచ్చారు. దీంతో మాళవిక నవ్వుతూ నాకు బియర్డ్ బెడ్ అని వినిపించింది అని చెప్పింది.

ఇక మాళవిక ఆన్సర్‌ను నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు. నాటీ మాళవిక అంటూ.. ఏం అడిగినా ఆన్సర్ ఇచ్చేస్తావా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.