వామ్మో.. శ్రీలీల కోసం ఇక్కడి వాళ్లే కాదు.. అక్కడి వాళ్లు కూడా ఎగబడుతున్నారుగా..

- Advertisement -

టాలీవుడ్ లో అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్లుగా గుర్తింపు తెచ్చుకున్న నటీమణులు చాలా మందే ఉన్నారు. ఇప్పుడు ఆ కోవలోకి చేరిపోయింది శ్రీలీల. దర్శక దిగ్గజం రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ‘పెళ్లి సందD’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది నటి శ్రీలీల. ఈ సినిమా తర్వాత తెలుగులో పలు సినిమాలు చేసినా గతేడాది వచ్చిన ‘ధమాకా’ సినిమాతో శ్రీలీల ఫామ్ లోకి వచ్చింది. ఇప్పుడు తెలుగులో వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. టాలీవుడ్ లో అరడజను సినిమాలకు పైగానే ఆమె చేతిలో ఉన్నాయి.

శ్రీలీల
శ్రీలీల

అయితే ప్రస్తుతం ఈ అమ్మడికి సంబంధించిన ఓ వార్త సందడి చేస్తుంది. శ్రీలీల క్రేజ్ చూసి ఇద్దరు పెద్ద తమిళ నిర్మాతలు తమ సినిమాలో నటించాలని ఆఫర్ చేశారట. అయితే, టాలీవుడ్‌లో బిజీ షెడ్యూల్ వల్ల శ్రీలీల వారికి సున్నితంగా నో చెప్పిందట. ఈ టైమ్ లో ఇలాంటి రిస్క్ లు చేయడం ఎందుకు అని తమిళ్ ఆఫర్ కు నో చెప్పిందట. అందులోనే ఇప్పటికే కొన్ని సినిమాలలో నటిస్తోంది ఇంకా కొన్ని సినిమాలు చర్చల్లో ఉన్నాయి. వాటన్నిటినీ పూర్తి చేయాలని అనుకుంటుందట శ్రీలీల. అలాగే ఇటీలవ టాలీవుడ్ సినిమా మార్కెట్ భారీగా పెరిగింది. అందుకే టాలీవుడ్ ను విడిచిపెట్టే ఆలోచన ఇప్పట్లో చేయదనే వార్తలు వస్తున్నాయి.

Sreeleela

ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటోంది శ్రీలీల. చిన్న హీరోలతోనే కాకుండా స్టార్ హీరోల పక్కన కూడా ఛాన్స్ లు కొట్టేస్తుందీ బ్యూటీ. ఇప్పటికే బాలకృష్ణ నటిస్తోన్న ‘ఎన్బీకే 108’లోనూ ఛాన్స్ కొట్టేసింది. ఈ మధ్యనే షూటింగ్ లో కూడా పాల్గొంది కూడా. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా నెట్టింట వైరల్ అయ్యాయి. అలాగే మహేష్ బాబు తాజా చిత్రం ‘గుంటూరు కారం’లో కూడా శ్రీలీల నటిస్తోంది. ఈ సినిమా కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే పవన్ కళ్యాణ్ నటిస్తోన్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ లో కూడా శ్రీలల నటిస్తోందని తెలుస్తోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here