OFFICIAL: వరుణ్‌ తేజ్‌, లావణ్య త్రిపాఠి పెళ్లి ఫిక్స్.. రేపే ఎంగేజ్‌మెంట్

- Advertisement -

టాలీవుడ్‌లో మరో ప్రేమ జంట ఒక్కటి కాబోతుంది. మెగా హీరో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. మెగా హీరో వరుణ్‌ తేజ్, లావణ్య త్రిపాఠి ప్రేమలో ఉన్నారంటూ కొన్నాళ్లుగా సినీ వర్గాల్లో టాక్‌ నడుస్తుంది. సోషల్‌ మీడియలో దీనిపై విపరీతమైన వార్తలు వచ్చాయి. అయితే దీనిపై ఎవరూ స్పందించక పోవటంతో రూమర్స్‌ అని అంతా అనుకున్నారు. అయితే ఈ సస్పెన్స్‌కు తెరదీస్తూ అధికారిక ప్రకటన వెలువడింది.

వరుణ్‌ తేజ్‌
వరుణ్‌ తేజ్‌

మెగా బ్రదర్‌ నాగబాబు కుమారుడు వరుణ్‌ తేజ్‌, హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం తేదీ అఫిషీయల్‌గా ప్రకటించారు. ఈ నెల 9న ఇరు కుటుంబాల సమక్షంలో వీరి ఎంగేజ్‌మెంట్‌ జరగనున్నట్లు ఓ కార్డ్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. దీనిని సినీవర్గాలు షేర్‌ చేస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. బంధుమిత్రులతో పాటు కొంతమంది సెలబ్రిటీల సమక్షంలో వీరి ఎంగేజ్‌మెంట్‌ జరనుందని సమాచారం. పెళ్లి ముహూర్తం ఇంకా ఖరారు చేయనప్పటికీ… ఈ ఏడాది పెళ్లి చేసుకుంటారని, అది కూడా అతి త్వరలో ఉంటుందని మెగా ఫ్యామిలీ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

varun-tej

కాగా.. 2017లో మిస్టర్ చిత్రం సెట్స్‌లో తొలిసారిగా ఈ జంట కలుసుకున్నారు. ‘మిస్టర్’లో వరుణ్ తేజ్, లావణ్యా త్రిపాఠి తొలిసారి జంటగా నటించారు. ఆ సినిమా చిత్రీకరణలో వాళ్ళిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. ఆ తర్వాత ‘అంతరిక్షం’లో మరోసారి నటించారు. ఆ స్నేహం క్రమంగా ప్రేమగా మారింది. వరుణ్ తేజ్ సోదరి నిహారికా కొణిదెల‌ వివాహానికి పరిశ్రమ నుంచి అతికొద్ది మందిని మాత్రమే ఆహ్వానించారు. ఆ అతిథుల జాబితాలో లావణ్యా త్రిపాఠి కూడా ఉన్నారు. రీతూ వర్మతో కలిసి వెళ్లారు. నిహారికకు వాళ్ళిద్దరు స్నేహితులే. అయితే… వరుణ్ తేజ్ ప్రేమ విషయం కూడా ఆ పెళ్ళిలో బయట పడింది. మెగా ఫ్యామిలీకి చెల్లెలి పెళ్ళిలో తన ప్రేమ సంగతి చెప్పారట. అప్పటి నుంచి సినీవర్గాల్లో వీరి ప్రేమ విషయంపై గుసగుసలు మెుదలయ్యాయి. అతికాస్త బయటకి పొక్కి సోషల్‌మీడియాలో వార్తలు హల్‌చల్‌ చేశాయి. ఇక ఎట్టకేలకు వరుణ్‌, లావణ్య పెళ్లి పీటలు ఎక్కనుండటంతో ఫ్యాన్స్‌ తెగ ఖుషీ అయిపోతున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here