మరోసారి తెరపైకి అనుష్కకు ఉన్న అరుదైన వ్యాధి.. ఇప్పుడేంచేస్తుందో అంటున్న ఫ్యాన్స్

- Advertisement -

ఇండస్ట్రీలో హీరోయిన్స్ సినిమాలు పంచుకున్నట్టు వ్యాధులు కూడా పంచుకుంటున్నారు. నీకు ఆ వ్యాధి ఉందా.. అయితే నాకు ఈ వ్యాధి ఉంది.. అంటూ రోజుకు ఒకరు సోషల్ మీడియాలో బయటకు వచ్చి తమకున్న వ్యాధుల గురించి చెప్తూ ఆడియన్స్ కు షాకుల మీద షాకులు ఇస్తున్నారు. ఇప్పటికే సమంత మయోసైటిస్ అనే డీసీజ్ తో బాధ పడుతుందని తెలిసి అభిమానులు చాలా కంగారు పడ్డారు. అంతలోనే పూనమ్ కౌర్ కూడా తనకు అలాంటి వ్యాధి ఉంది అంటూ చెప్పి.. ఆ షాక్ కంటిన్యూ చేసింది. ఈ మధ్య పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కూడా తనకు గుండె సమస్య ఉంది అంటూ బాంబు పేల్చింది.

 అనుష్క శెట్టి
అనుష్క శెట్టి

ఇదిలా ఉంటే అనుష్క శెట్టి కూడా ఒక అరుదైన వ్యాధితో బాధపడుతోన్న విషయం తెలిసిందే. నవ్వడం ఒక భోగం.. నవ్వించడం ఒక యోగం.. నవ్వకపోతే రోగం అంటారు. కానీ అనుష్క మాత్రం నవ్వితేనే రోగం అనే వార్తలు వస్తున్నాయి. ఇదేంటి కొత్తగా అనుకోవచ్చు.. కాకపోతే ఏదైనా నవ్వే సందర్భం వస్తే నాన్ స్టాప్ లో 20 నిమిషాల పాటు అనుష్క ఆపకుండా నవ్వుతుందని.. అదే తన సమస్య అని కొన్నిసార్లు సన్నిహితులతో కూడా అనుష్క చెప్పిందని తెలుస్తోంది. ఎంత కంట్రోల్ చేసుకోవాలనుకున్న కూడా ఆ నవ్వును ఆమె కంట్రోల్ చేసుకోలేకపోతుందని.. దానివల్ల షూటింగ్ లో కూడా చాలా డిస్టర్బెన్స్ వస్తుందట.

anushka shetty

అయితే ప్రస్తుతం ఈ అమ్మడు ఓ కామెడీ సినిమాలో నటిస్తుంది. ఆ సినిమాలోని సన్నివేశాలకు పాపం నవ్వుతూనే ఉంటుందిట. దీనికి ఏం చేయాలో అర్థం కావట్లేదుట. దీంతో అనుష్కకు ఉన్న అరుదైన వ్యాధి మరోసారి తెరపైకి వచ్చింది. సౌత్ స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి ప్రస్తుతం యంగ్‌ హీరో నవీన్ పొలిశెట్టితో కలిసి ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అదే మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. పి. మహేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here