Kanguva Sizzle Teaser : అబ్బుపరిచేలా కంగువ టీజర్.. సూర్య‌ కత్తి సీన్లు సూప‌ర్‌

- Advertisement -

Kanguva Sizzle Teaser : కంగువ టీజర్ విడుదలైంది. విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్, డిఫరెంట్ గెటప్ సూర్య విశ్వరూపం చూపించారు. హీరో సూర్య ప్రధాన పాత్రలో రూపొందుతున్న కంగువపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ఫస్ట్‌లుక్, గ్లింప్స్ ఇలా ప్రతి అంశం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. భారీ బడ్జెట్ తో ఫాంటసీ యాక్షన్ మూవీగా ఈ సినిమా రూపొందుతోంది. శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సూర్య డిఫరెంట్ గెటప్‌లో యోధుడిగా నటిస్తున్నాడు. కాగా, కంగువ సినిమా టీజర్ ఈరోజు (మార్చి 19) విడుదలైంది. హైప్‌కి తగ్గట్టుగానే ఈ సిజిల్ టీజర్ అద్భుతంగా ఉంది. కంగువ ప్రపంచానికి సిద్ధం అనే పదంతో ఈ టీజర్ మొదలవుతుంది. బీచ్‌లో జాతర ఏర్పాటుతో ఇది ప్రారంభమైంది. పులి ముందుండగా కత్తి తీసే షాట్ అదిరిపోయింది. మృతదేహాలను కుప్పగా విసిరేయడం.. తెగల మధ్య పోరు ఆసక్తికరంగా ఉంది. సముద్రంలో ఓడలతో భారీ యాక్షన్ సీక్వెన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

పొడవాటి జుట్టు, ఇంటెన్స్ గెటప్‌తో సూర్య. ఓ తెగ నాయకుడని ఈ టీజర్ చూస్తే తెలుస్తుంది. కత్తితో నరికి చంపే సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయి. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కూడా క్రూరమైన భయానక పాత్ర చేస్తున్నాడని అర్థమవుతోంది. కంగువ టీజర్ సూర్య , సన్నీ ఒకరినొకరు ఎదుర్కొనే షాట్‌తో ముగుస్తుంది. అద్భుతమైన విజువల్స్, దర్శకుడు శివ టేకింగ్, భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు, సూర్య, బాబీ డియోల్‌ల సూపర్ స్క్రీన్ ప్రెజెన్స్, కంగువ టీజర్ అద్భుతంగా ఉన్నాయి. కంగువ టీజర్‌లో దేవిశ్రీప్రసాద్ అందించిన నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకునేలా ఉంది. వెట్రి పళనిస్వామి సినిమాటోగ్రఫీ కూడా గ్రాండ్‌గా కనిపిస్తోంది. ఈ టీజర్ చూస్తుంటే కొన్ని తెగల మధ్య ఆధిపత్యం కోసం యుద్ధాలు జరుగుతున్న నేపథ్యంలో కంగుతినడం ఖాయం.

- Advertisement -

కంగువలో సూర్యతో పాటు బాబీ డియోల్, దిశా పటాని, నటరాజన్ సుబ్రమణ్యం, జగపతి బాబు, యోగిబాబు, రెడిన్ కింగ్స్లీ, కోవై సరళ, ఆనందరాజ్‌లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆది నారాయణ కథ అందించిన ఈ చిత్రానికి దర్శకుడు శివ దర్శకత్వం వహిస్తున్నారు. స్టూడియో గ్రీన్, యువి క్రియేషన్స్ బ్యానర్లపై కెఇ జ్ఞానవేల్ రాజా, వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే కంగువ సినిమా విడుదల తేదీని మేకర్స్ ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. ఈ ఏడాదిలోనే ఈ సినిమా విడుదలవుతుందనే అంచనాలు ఉన్నాయి. అయితే తేదీ ఇంకా ఖరారు కాలేదు. పీఎఫ్‌ఎక్స్‌ భారీ మొత్తంలో ఉండటంతో సినిమా ఆలస్యమవుతోందని తెలుస్తోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here