Disha Patani : కొత్త యాంగిల్ చూపించిన దిశా పటాని.. వామ్మో అంటున్న నెటిజన్లు..

- Advertisement -

Disha Patani : ‘లోఫర్’ సినిమాతో పూరి జగన్నాథ్‌‌‌‌‌‌‌‌ హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా ఇంట్రడ్యూస్‌‌‌‌‌‌‌‌ చేసిన దిశా పటాని, ఆ తర్వాత మళ్లీ ఎప్పుడూ తెలుగులో కనిపించలేదు. ఎంఎస్ ధోని, భాగీ2, రాధే లాంటి సినిమాలతో బాలీవుడ్‌‌‌‌‌‌‌‌లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఏడాదికి నాలుగు అయిదు సినిమాలు చేస్తూ..సోషల్‌‌‌‌‌‌‌‌ మీడియా ఫాలోయింగ్‌‌‌‌‌‌‌‌, డేటింగ్ కబుర్లతో తరచుగా తన పేరు బీటౌన్‌లో వినిపిస్తుంటుంది.అలాగే, సోషల్‌ మీడియాలో అందాల ఆరబోతతో ఫోటో షూట్స్ షేర్ చేస్తూ తన అభిమానులకు కన్నుల విందు చేస్తుంది.

Disha Patani
Disha Patani

లేటెస్ట్గా తనలోని మరో ఇంట్రెసింగ్ యాంగిల్ ను ఆడియాన్స్ ముందుకు తీసుకొచ్చింది. ఒక మ్యూజిక్ ఆల్బం కి డైరెక్ట్ చేసి శభాష్ అనిపించుకొంటోంది. తాజాగా ఆ మ్యూజిక్‌ ఆల్బం రిలీజ్ కూడా అయింది. దిశా పటాని గతంలో కూడా రెండు మ్యూజిక్ ఆల్బమ్ లో నటించిన విషయం తెలిసిందే. ఇక తన మూడో మ్యూజిక్‌ ఆల్బం అయిన క్యూన్ కర్ ఫికర్‌ తో ఆడియన్స్ ముందుకు రావడంతో పాటు నటిస్తూ..డైరెక్షన్ కూడా చేసింది.ప్రసెంట్ ఈ బ్యూటిఫుల్ ఆల్బం కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఎప్పుడు హాట్ ఫొటోస్తో హీటెక్కించే ఈ భామ..మ్యూజిక్ టాలెంట్తో రావడం ఫ్యాన్స్కు కిక్కిచ్చేస్తోంది.

Disha Patani
Disha Patani

దీంతో ముందు ముందు మరెన్ని కలలు ఈమె నుంచి చూడాల్సి వస్తుందో అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. దిశా పటాని తక్కువ కాలంలోనే తెలుగు, హిందీ, చైనీస్‌, తమిళంలో హీరోయిన్ గా చుట్టేసింది. చైనీస్‌ భాషలో వరల్డ్‌ సూపర్‌స్టార్‌ జాకీచాన్‌కు జోడీగా కుంగ్‌ ఫూ. యోగా చిత్రంలో నటించి పాన్‌ వరల్డ్‌ నటిగా గుర్తింపు తెచ్చుకుంది. చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్న దిశా పటాని ..ప్రస్తుతం సూర్య హీరోగా నటిస్తున్న కంగువా చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here