Bigg Boss Abijeet ఏమయ్యాడు..? పాపం ఇతని పరిస్థితి చూస్తే కన్నీళ్లు ఆగవు

- Advertisement -

Bigg Boss Abijeet : తెలుగు లో బిగ్ బాస్ రియాలిటీ షో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే..ఆరు సీజన్స్ ని పూర్తి చేసుకున్న ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో ఎంతో మంది సెలెబ్రెటీలకు సరికొత్త కెరీర్ ని ఇచ్చింది.ముఖ్యంగా బిగ్ బాస్ సీజన్ 4 ప్రేక్షకులను ఎంతగానో అలరించింది.ఈ సీజన్ టైటిల్ విన్నర్ గా అభిజీత్ నిల్చిన సంగతి అందరికీ తెలిసిందే.హౌస్ లో ఉన్నన్ని రోజులు చాలా కూల్ యాటిట్యూడ్ తో ముందుకు సాగిన అభిజీత్ కి ఫాలోయింగ్ మామూలు రేంజ్ లో రాలేదు.

Bigg Boss Abijeet
Bigg Boss Abijeet

శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ కి హీరో గా పరిచయమైనా అభిజీత్, ఆ రెండు మూడు సినిమాల్లో హీరో గా నటించినప్పటికీ ఎందుకో ఆయనకీ ఆశించిన స్థాయిలో సక్సెస్ మాత్రం రాలేదు.ఆ తర్వాత బిగ్ బాస్ షో లో పాల్గొనే అవకాశం రావడం తో వెంటనే ఓకే చెప్పి ఒక కంటెస్టెంట్ గా అడుగుపెట్టాడు.

తెలివిగా టాస్కులు ఆడే విధానం దగ్గర నుండి, హౌస్ మేట్స్ తో మెలిగే తీరువరకు ప్రతీ ఒక్క విషయం లో అభిజీత్ ఆడియన్స్ కి తెగ నచ్చేసాడు.ఒక రేంజ్ క్రేజ్ మరియు పాపులారిటీ తో హౌస్ నుండి బయటకి వచ్చిన అభిజీత్ కి హీరో గా వరుసగా ఆఫర్లు వస్తాయని, ఇక నుండి ఆయన కెరీర్ వేరే లెవెల్ లో ఉండబోతుందని అందరూ ఊహించారు.వెంకీ అట్లూరి , పరశురామ్ వంటి డైరెక్టర్స్ అభిజిత్ తో సినిమాలు చెయ్యడానికి సిద్ధం గా ఉన్నారని , టాప్ లీడింగ్ ప్రొడక్షన్ హౌస్లు కూడా అభిజీత్ మీద కోట్లు పెట్టి సినిమాలను నిర్మించడానికి సిద్ధంగా ఉన్నారని, ఇలా పలు రకాల వార్తలు ఆరోజుల్లో జోరుగా ప్రచారం సాగాయి.

- Advertisement -

కానీ ఏది నిజం కాలేదు, బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వచ్చిన తర్వాత అసలు ఈయన ఆచూకీ కూడా కనపడలేదు. మధ్యలో అమెజాన్ ప్రైమ్ సంస్థ నిర్మించిన ‘మోడరన్ లవ్ హైదరాబాద్’ అనే వెబ్ సిరీస్ లో కనిపించాడు అంతే.ఆ ఒక్క వెబ్ సిరీస్ మినహా అభిజిత్ చేతిలో ప్రస్తుతానికి ఏమి లేవు, ఇంట్లో ఖాళీగానే ఉంటున్నాడు.అలా బిగ్ బాస్ టైటిల్ గెలిచి మంచి ఫాలోయింగ్ ని సంపాదించిన అభిజిత్ వేరే లెవెల్ కి వెళ్లాడని ఆశిస్తే ఎటు కాకుండా పోయాడని ఆయన అభిమానులు ఫీల్ అవుతున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here