Janhvi Kapoor : #NTR30 కోసం జాన్వీ కపూర్ తీసుకునే రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..! ఆమె పెట్టిన కండిషన్స్ చూస్తే షాక్ అవుతారు

- Advertisement -

Janhvi Kapoor : RRR చిత్రం తర్వాత జూనియర్ ఎన్టీఆర్ చెయ్యబొయ్యే కొరటాల శివ మూవీ షూటింగ్ ప్రారంభం కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ సుమారుగా ఏడాది నుండి ఎదురు చూస్తూనే ఉన్నారు. ఈ సినిమా నుండి ఎలాంటి అప్డేట్ రాకపోవడం తో ఆయన ఫ్యాన్స్ చాలా ఫ్రస్ట్రేషన్ కి గురయ్యారు. ఎప్పుడెప్పుడు ఈ సినిమా ప్రారంభం అవుతుందా అని ఎదురు చూసిన అభిమానులకు ఎన్టీఆర్ ఫిబ్రవరి నెలలోనే ముహూర్త కార్యక్రమాలు పూర్తి చేసి మార్చి నుండి రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభిస్తాము అని చెప్పుకొచ్చారు.

Janhvi Kapoor
Janhvi Kapoor

కానీ ఆయన సోదరుడు నందమూరి తారకరత్న చనిపొయ్యేలోపు షూటింగ్ వాయిదా పడింది.ఈ నెల 27 వ తారీకు నుండి షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు.ఇది ఇలా ఉండగా ఈ సినిమాలో హీరోయిన్ గా అతిలోక సుందరి కూతురు జాన్వీ కపూర్ చేస్తుందని గత కొంతకాలం నుండి సోషల్ మీడియా లో ఒక వార్త జోరుగా ప్రచారమైంది.

అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఈరోజు ఆమె పుట్టినరోజు సందర్భంగా మూవీ టీం ప్రకటించింది.చాలా రోజుల క్రితమే జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఫిక్స్ అయ్యింది.ఆమె లుక్ కి సంబంధించిన ఫోటో షూట్ కూడా కొద్దిరోజుల క్రితమే చేసారు.ఆ ఫోటో షూట్ కి సంబంధించిన ఒక ఫోటోని ఎంచుకొని ఈరోజు ఆమెకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తూ అధికారిక ప్రకటన చేసింది మూవీ టీం.

- Advertisement -
Janhvi Kapoor Photos

ఇక NTR 30 సినిమా లో హీరోయిన్ గా చేస్తున్నందుకు గాను ఆమెకి భారీ మొత్తం లోనే పారితోషికం అందిస్తున్నారట. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఆమెకి నిర్మాతలు 5 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని ఇస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ లీడింగ్ లో కొనసాగుతున్న ఏ హీరోయిన్ కూడా ఇంత మొత్తం లో పారితోషికం అందుకోవడం లేదు. అలాంటిది జాన్వీ కపూర్ తొలి సినిమాతోనే అంత మొత్తం అందుకోవడం సెన్సేషనల్ టాపిక్ గా మారింది.

Janhvi Kapoor

అంతే కాదు ఈ సినిమాలో చేస్తున్నందుకు గాను ఆమె పెట్టిన కండిషన్స్ వింటే షాక్ అవ్వాల్సిందే. ఆమెకి సంబంధించి ఏ చిన్న షూట్ జరిగినా అది ఎడిటింగ్ లో తియ్యరాదని చెప్పిందట, షూటింగ్ కి ఇచ్చిన డేట్స్ లోనే నా పాత్రని పూర్తి చెయ్యాలని, అదనపు కాల్ షీట్స్ అడగకూడదని కూడా చెప్పిందట. ఈ షూటింగ్ కోసం ఉన్నన్ని రోజులు ఆమె ఖర్చులు, ఆమె స్టాఫ్ కి అయ్యే ఖర్చులు కూడా ప్రొడక్షన్ టీం భరించాలని ఈ సందర్భంగా ఆమె చెప్పిందట. అలా జాన్వీ కపూర్ కండిషన్స్ అన్నీ ఒప్పుకున్న తర్వాతే మూవీ కి సంతకం చేసినట్టు ఫిలిం నగర్ లో టాక్.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here