Guess The Actress : ఈ ఫొటో లో ఉన్న చిన్నారి ఇప్పుడు ఇండియా ని షేక్ చేస్తుంది.. ఎవరో గుర్తుపట్టారా?

- Advertisement -

Guess The Actress : ఈ క్రింది ఫోటో లో కనిపిస్తున్న ఈ అమ్మాయిని ఎవరైనా గుర్తుపట్టారా..? అతి చిన్న వయస్సులోనే ఇండస్ట్రీ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే తన అందచందాలతో కుర్రకారులో సెగ పుట్టించింది. ఆ సినిమా భారీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం తో వరుసగా స్టార్ హీరోల సరసన నటించే అవకాశం దక్కించుకుంది. చూస్తూ ఉండగానే పాన్ ఇండియన్ స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది. కోటి రూపాయిల పారితోషికం తీసుకున్న మొట్టమొదటి సౌత్ ఇండియన్ హీరోయిన్ గా చరిత్ర సృష్టించింది.

Guess The Actress
Guess The Actress

ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీ లో అడుగుపెట్టి అక్కడ కూడా స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇన్ని క్లూలు ఇచ్చినా గుర్తుపట్టలేకపోతున్నారా..? ఆమె మరెవరో కాదండి మన గోవా బ్యూటీ ఇలియానా. ఈమె చిన్నప్పటి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా ని షేక్ చేసేస్తున్నాయి. ఎల్లప్పుడూ తన హాట్ ఫోటోలను అప్లోడ్ చేస్తూ సోషల్ మీడియా లో ఉన్న యూత్ కి పిచ్చెక్కించే ఇలియానా తన చిన్ననాటి ఫోటోలను కొన్ని షేర్ చేసింది.

Ileana

ఇప్పుడు ఎంత క్యూట్ గా అయితే కనిపిస్తుందో చిన్నతనం లో అంతకు మించి పది రేట్లు క్యూట్ గా కనిపిస్తుంది. దేవదాసు సినిమాతో ఇండస్ట్రీ కి పరిచయమైనా ఇలియానా ఆ తర్వాత సౌత్ లో ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ గా ఎదిగిందో మన కళ్లారా చూసాము. కానీ ఎప్పుడైతే ఈమె సౌత్ సినిమాలకు రెమ్యూనరేషన్ అమాంతం పెంచేయడం ప్రారంభించిందో, అప్పటి నుండి దర్శక నిర్మాతలు ఈమెవైపు చూడడం మానేశారు. దాంతో ఈమె బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది.

- Advertisement -
Ileana Photos

అక్కడ పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది కానీ, సౌత్ ఇండియా లో వచ్చినంత సక్సెస్ మాత్రం అక్కడ రాలేదు. అందువల్ల ప్రస్తుతం ఆమెకి సినిమాల్లో అవకాశాలు లేక ఖాళీగానే ఉంటుంది. ఇలియానా తెలుగులో కనిపించిన చివరి చిత్రం రవితేజ హీరో గా నటించిన ‘అమర్ అక్బర్ ఆంటోనీ’. ఆ సినిమా తో తెలుగులో గ్రాండ్ రీ ఎంట్రీ ఇవ్వాలనుకుంది కానీ, అది పెద్ద ఫ్లాప్ అవ్వడం తో అవకాశాలు రాలేదు. ఇది ఇలా ఉండగా ఆమెకి సంబంధించిన కొన్ని చిన్ననాటి ఫోటోలను ఎక్సక్లూసివ్ గా మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.

Ileana Childhood photos
ileana images
Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here