Kasturi : అవకాశాలు కావాలంటే పడుకోవాల్సిందే.. సీనియర్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు

- Advertisement -

Kasturi : సినిమా అనేది కలల ప్రపంచం. ఇందులో ఊహించిన విధంగా రాణించాలంటే చాలా కష్టపడాల్సిందే. ఇండస్ట్రీ క్యాస్టింగ్ కౌచ్ బారిన పడని వాళ్లను వేళ్ల మీద లెక్క పెట్టొచ్చేమో. ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఉన్న వాళ్ల జోలికైతే వెళ్లకపోవచ్చు కానీ.. కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చే వాళ్లు.. అవకాశాల కోసం ఎదురుచూసే వాళ్లనైతే ఇండస్ట్రీలోని రసికరాజులు. అవకాశం ఇస్తా.. మరి నాకేంటి? అనే వాళ్లకు లొంగేవాళ్లు కొందరైతే.. అలాంటి పాడుపనులకు బలవడం ఇష్టం లేక ఇండస్ట్రీ నుంచి వచ్చేసే వాళ్లు ఇంకొందరు. అది కాకుండా ఎదురుతిరిగితే అవకాశాలు లేకుండా చేసిన సందర్బాలూ ఉన్నాయి. అలాగే వాళ్లకి లొంగిన తర్వాత కొందరిని అగ్రపీఠంపై కూర్చోబెట్టిన సందర్భాలూ ఉన్నాయి. అలాగే అన్ని విధాలుగా వాడుకుని గెంటేసినా సందర్భాలూ ఉన్నాయి.

ఇండస్ట్రీలోని క్యాస్టింగ్ కౌచ్, మీటూ ఉద్యమంలో చాలామంది రసికరాజుల పేర్లు బయటకు వచ్చాయి. అవకాశాల పేరుతో తనను ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఉన్నాయని ఉన్నాయని చెప్పింది సీనియర్ నటి కస్తూరి శంకర్. తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ‘మీటూ ఎక్స్‌పీరియన్స్ నాకూ చాలా ఉన్నాయి. దానిపై నేను మాట్లాడాను. వాటికి ఒప్పుకోలేదని సినిమాల్లో తీసేశారు. ఎపిసోడ్స్ లేపేశారు. తెలుగులో అలాంటి ఎక్స్‌పీరియన్స్ లేదు కానీ.. తమిళ్‌లో ఉంది. మలయాళం ఇండస్ట్రీ కూడా వరస్ట్. మలయాళం సినిమాలో చాలా వరస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. అక్కడ నుంచి ఎస్కేప్ అవ్వడం నా అదృష్టం. కానీ ఇప్పుడు మలయాళం ఇండస్ట్రీ సూపర్ ఉంది. ఆ వరస్ట్ ఎక్స్‌పీరియన్స్ అప్పటికి నాకు పెళ్లైంది కూడా. నా కమ్ బ్యాక్ మూవీ అది. అది చాలా పెద్ద ప్రాజెక్ట్.. ఒప్పుకోలేదని ఆ ప్రాజెక్ట్ నుంచి తీసేశారు. అన్ని చోట్లా అన్నీ ఉంటాయి. అన్ని ఫీల్డ్‌లలో ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి. అంతెందుకు ఒక బిల్డింగ్ కడుతుంటే.. మేస్త్రికి వర్కర్స్‌కి మధ్య ఎఫైర్లు ఉంటాయి. ఎక్కడైనా ఇలాంటివి ఉంటాయి.

- Advertisement -

మంచి వాళ్లూ ఉంటారు. చెడ్డవాళ్లూ ఉంటారు. అందర్నీ ఒకే దృష్టితో చూసి మాట్లాడకూడదు. నాకు మీటూ ఎక్స్ పీరియన్స్ ఉంది. అలాగని ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోవాలని లేదు కదా. 85 సినిమాలు చేశాను. అందరితోనే అలాంటి ఎక్స్‌పీరియన్స్ లేదు కదా.. ఇండస్ట్రీ చెడ్డదైతే ఇన్ని సినిమాలు ఎలా చేస్తాను. ఇంత వరకూ ఎలా వస్తాను. నాకు ఇప్పుడు కూడా అవకాశాలు వస్తున్నాయి. కాబట్టి అన్ని చోట్లా చెడు అనేది ఉంటుంది. ఇలాంటి వాళ్లు అన్ని చోట్లా ఉంటారు. వాళ్లు ఉన్నారని ఇండస్ట్రీ చెడ్డదని కాదు.. వాళ్లు చెడ్డవాళ్లు.. అలాంటి వాళ్లు సినిమా ఇండస్ట్రీలోనే కాదు.. ఎక్కడున్నా ఇలాగే ఉంటారు.. ప్రత్యేకంగా సినిమా ఇండస్ట్రీలోనే ఇలాంటివి ఉంటున్నాయని కాదు.. అన్ని చోట్లా ఉంటున్నాయి.. వాటిని ఎలా ఫేస్ చేశాం అన్నదే ముఖ్యం’ అంటూ చెప్పుకొచ్చింది సీనియర్ నటీమణి కస్తూరి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here