Amardeep : బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా టైటిల్ కోసం పోటీ పడుతున్న వ్యక్తి అమర్ దీప్. మొదటి వారాలు అమర్ నెగటివ్ గా జనాలకు ప్రాజెక్ట్ అయ్యాడు. పల్లవి ప్రశాంత్ ‘రైతు బిడ్డ’ ట్యాగ్ ని వాడుకొని సానుభూతి పొందుతున్నాడు అనే విషయాన్నీ ప్రాజెక్ట్ చెయ్యాలని చూసి, ఆయన రైతుల మీద కామెంట్స్ చేసినట్టుగా జనాలకు అర్థం అయ్యింది. దీంతో బోలెడంత నెగటివిటీ ని ఎదురుకున్నాడు అమర్ దీప్.

హౌస్ లోకి వెళ్లి ఎదో పొడిచేస్తాడు, పీకేస్తాడు అనుకుంటే ఇలా మాట్లాడుతున్నాడు ఏమిటి?, ఇతను ఆలోచనలు ఇంత చెత్తగా ఉన్నాయేంటి అని అందరూ అనుకున్నారు. అలాగే గేమ్స్ ఆడడం లో కూడా చాలా మొదట్లో చాలా ఫౌల్స్ ఆడుతూ నాగార్జున చేత ప్రతీ వారం తిట్టించుకునేవాడు. కానీ ఆరవ వారం నుండి అతని ఆట తీరు మొత్తం మారిపోయింది. జనాలు అమర్ ని బాగా అర్థం చేసుకున్నారు, ఇప్పుడు ఆయన టాప్ 1 స్థానం లో కొనసాగుతున్నాడు.

ఇదంతా పక్కన పెడితే అమర్ దీప్ హౌస్ లోకి అడుగుపెట్టిన మొదటి రోజు నుండి నేటి వరకు ఈ నెగటివ్ కామెంట్స్ చేసే శివాజీ పీఆర్ టీం పై ఆయన స్నేహితుడు మరియు కో ఆర్టిస్ట్ నరేష్ పోరాడుతూనే ఉన్నాడు. ఆయన మాట్లాడుతూ ‘ఇప్పటి వరకు జరిగిన సీజన్స్ అన్నిట్లో ఏ అమ్మాయి కూడా ఎదురుకోని నెగటివిటీ ని అమర్ భార్య తేజస్విని ఎదురుకుంది. పైడ్ పీఆర్ టీం ఎన్నో వందల అకౌంట్స్ నుండి కామెంట్స్ చేస్తూ, తేజస్విని కి అసలు తన యూట్యూబ్ ఛానల్ లో వీడియో ని అప్లోడ్ చెయ్యడానికే భయపడేలా చేసారు.
కొంతమంది అయితే తేజస్విని ముఖం తో మార్ఫింగ్స్ చేసి, చెప్పుకోలేని అస్లీల ఫోటోలకు అంటించారు. అవి ఆమె కంటపడకుండా నేను చూసి , అలాంటి ఫోటోలు క్రియేట్ చేసిన వారిపై సైబర్ క్రైమ్ కంప్లైంట్ ఇచ్చాను’ అంటూ చెప్పుకొచ్చాడు. దీనిని బట్టీ అర్థం చేసుకోవచ్చు, తేజస్విని ని ఏ రేంజ్ లో పీఆర్ టీం టార్గెట్ చేసింది అనేది.