Naga Chaitanya : నటుడిగా నేను పెద్ద ఫెయిల్యూర్ ని.. అవకాశం కోసం ఎదురు చూస్తున్న : నాగ చైతన్య

- Advertisement -

Naga Chaitanya : అక్కినేని నాగార్జున నటవారసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన నాగచైతన్య తొలి రెండు సినిమాలతోనే తన మార్కు ని ఆడియన్స్ లో క్రియేట్ చేసుకున్నాడు. ముఖ్యంగా యూత్ ఆడియన్స్ లో నాగ చైతన్య సినిమాలకు మంచి డిమాండ్ ఉంటుంది. ఆయన సినిమాలు కూడా ఎక్కువగా యూత్ ని టార్గెట్ చేస్తూ ఉంటాయి. కెరీర్ లో క్లాసిక్స్ ఉన్నాయి, సూపర్ హిట్స్ ఉన్నాయి, అలాగే బ్లాక్ బస్టర్ హిట్స్ కూడా ఉన్నాయి.

Naga Chaitanya
Naga Chaitanya

కానీ స్టార్ స్టేటస్ మాత్రం లేదు. ఈయన సినిమా పొరపాటున ఫ్లాప్ అయితే కనీసం 5 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను కూడా రాబట్టలేకపోతున్నాయి ఈమధ్య. ‘థాంక్యూ’ చిత్రానికి ముందు నాగ చైతన్య 5 సూపర్ హిట్ సినిమాలను అందుకున్నాడు, కానీ ‘థాంక్యూ’ కి చిత్రానికి అది ఏ మాత్రం ఉపయోగపడలేదు. టాక్ రాకపొయ్యేసరికీ 5 కోట్ల రూపాయిల లోపే క్లోసింగ్ పడిపోయింది.

Naga Chaitanya Photos

ఇప్పుడు ఆయన లేటెస్ట్ గా ‘దూత’ అనే వెబ్ సిరీస్ తో అమెజాన్ ప్రైమ్ ద్వారా మన ముందుకు రాబోతున్నాడు. ఈ సిరీస్ పై నాగ చైతన్య చాలా ఆశలు పెట్టుకున్నాడు. నటుడిగా ఈ సిరీస్ తనని ఒక మెట్టు పైకి ఎక్కిస్తుందని బలంగా నమ్ముతున్నాడు. రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూ లో నాగ చైతన్య మాట్లాడుతూ ‘కమర్షియల్ హీరో గా నేను సక్సెస్ అయ్యాను కానీ, నటుడిగా మాత్రం ఇంకా సక్సెస్ కాలేదు.

- Advertisement -

చాలా నేర్చుకోవాలి, సరైన కథ కోసం ఎదురు చూస్తున్న సమయం లో నాకు ‘తండేల్’ చిత్రం లో నటించే అవకాశం దక్కింది. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కనుంది. ఇప్పటి వరకు నేను చెయ్యని పాత్ర ని చేస్తున్నాను. ఈ సినిమా నాలోని నటుడిని బయటకి తీసుకొస్తుందని నమ్ముతున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు నాగ చైతన్య. ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here