Shivaji : అమర్ దీప్ విషయం లో మృగం లాగ ప్రవర్తించిన శివాజీ..కెప్టెన్సీ టాస్కుని రద్దు చేసిన బిగ్ బాస్!

- Advertisement -

Shivaji : ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన రోజు నుండి అమర్ దీప్ పట్ల శివాజీ ప్రవర్తన ని జనాలు మొత్తం చూస్తూనే ఉన్నారు. అమర్ దీప్ ని ఎన్ని విధాలుగా అవమానించాలో అన్నీ విధాలుగా అవమానించి అతనిలో ఆత్మ విశ్వాసం ని చంపేసేలా చేసాడు. అమర్ పట్ల శివాజీ కి ఎంత కుళ్ళు ఉంది అనేది నిన్నటి ఎపిసోడ్ తో కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులకు అర్థం అయ్యింది.

Shivaji
Shivaji

శివాజీ కి ఇంత కాలం సపోర్ట్ చేస్తూ వచ్చిన ఆడియన్స్ కూడా నిన్న ఆయన అసలు రంగు చూసి ఛీ అని అంటున్నారు. ఈ వారం అమర్ కెప్టెన్ అయ్యేందుకు సపోర్ట్ చేస్తాను అని శివాజీ పదే పదే ఆయనకీ మాట ఇచ్చాడు. మాట ఇస్తే ప్రాణం ఇచ్చేస్తా, నీకే ఈసారి నా సపోర్ట్ అని అమర్ కి కూడా చెప్పాడు. అమర్ దీప్ శివాజీ ని నిజంగా చాలా నమ్మాడు.

కానీ శివాజీ మాత్రం చివరికి వెన్నుపోటు పొడిచాడు. అర్జున్ భార్య గర్భం ని అడ్డు పెట్టుకొని అమర్ పై తనకి ఉన్న గ్రడ్జి మొత్తం తీర్చుకున్నాడు. అర్జున్ భార్య గర్భం తో వచ్చి మరోసారి కెప్టెన్ గా చూడాలని కోరిక గా ఉంది, అందుకే నేను అర్జున్ కి సపోర్టు చేస్తున్నాను అని ప్లేట్ ఫిరాయించాడు. అదేంటి అన్న, నేను కెప్టెన్ అవ్వాలని నా భార్య మరియు తల్లితండ్రులు కూడా కోరుకుంటారు కదా అన్నా అని అమర్ దీప్ అనగా, ఇక్కడ నువ్వు సెంటిమెంట్ ట్రై చేస్తే ఏమి లాభం లేదు అంటూ శివాజీ క్రూర మృగం లాగ ప్రవర్తించాడు.

- Advertisement -

ఆయన అర్జున్ కి సెంటిమెంట్ ని అడ్డుపెట్టుకొనే సపోర్ట్ చేస్తూ, అమర్ దీప్ ని మాత్రం సెంటిమెంట్ వాడొద్దు అని చెప్పడం శివాజీ రెండు మాటల ధోరణికి నిదర్శనం అని చెప్పొచ్చు. శోభా శెట్టి అమర్ దీప్ కి నా సపోర్ట్ అని చివరి వరకు బలంగా నిలబడింది, శివాజీ అర్జున్ కి నా సపోర్ట్ అంటూ నిలబడింది, అలా ఇద్దరు చివరి వరకు నిలబడి ఏకాభిప్రాయానికి రాకపోవడం వల్ల బిగ్ బాస్ కెప్టెన్సీ టాస్కు ని ఈ వారానికి రద్దు చేసాడు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here