Venkatesh: హాట్ బ్యూటీతో వెంకటేష్ సరసాలు.. మరో రానా నాయుడు కానుందా..

- Advertisement -

Venkatesh: వెంకటేష్‌ హీరోగా నటిస్తోన్న తొలి పాన్‌ ఇండియా మూవీ ‘సైంధవ్‌’ (Saindhav). ఇప్పటి వరకు ఫ్యామిలీ ఆడియన్స్‌ హీరోగా పేరున్న వెంకటేష్‌ ఈ చిత్రంతో మాస్‌ ప్రేక్షకులను కూడా ఆకట్టుకోవడానికి సిద్ధమయ్యారు. అందుకే ‘హిట్‌’ లాంటి సినిమాకు దర్శకత్వం వహించిన శైలేష్‌ కొలను (Sailesh Kolanu)తో కలిసి సినిమా చేస్తున్నారు. వెంకటేష్‌ 75వ (#Venky75) చిత్రంగా రూపొందుతోన్న ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్‌ అప్‌డేట్‌ను చిత్రబృందం ప్రకటించింది.

Venkatesh
Venkatesh

బాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధిక్ ఈ చిత్రంతో టాలీవుడ్ అరంగేట్రం చేస్తున్నారు. మనోజ్ఞ పాత్రలో శ్రద్ధా శ్రీనాథ్ ఫిమేల్ లీడ్ గా నటిస్తోంది. ఇటీవలె రుహాని శర్మ పాత్రను డాక్టర్ రేణు గా పరిచయం చేశారు. ఈరోజు ఈ సినిమాలో మరో కీలక పాత్రను పరిచయం చేశారు మేకర్స్. బ్యూటీఫుల్ అండ్ టాలెంటెడ్ ఆండ్రియా జెర్మియా (Andrea jeremiah) ఈ చిత్రంలో జాస్మిన్ పాత్రలో నటిస్తున్నారు. బ్లాక్ అండ్ బ్లాక్ అవుట్ ఫిట్ లో చేతిలో తుపాకీతో ఇంటెన్స్ లుక్ తో కనిపించింది ఆండ్రియా. పోస్టర్ లో స్పోర్ట్స్ బైక్‌ను కూడా గమనించవచ్చు. ఈ సినిమాతో దాదాపు ప‌దేళ్ల త‌ర్వాత ఆండ్రియా టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తోంది. చివ‌ర‌గా తెలుగులో నాగ‌చైత‌న్య‌, సునీల్ హీరోలుగా న‌టించిన త‌డాఖా సినిమాలో ఆండ్రియా ఓ హీరోయిన్‌గా న‌టించింది.

Andrea jeremiah

నాగ‌చైత‌న్య సినిమా త‌ర్వాత టాలీవుడ్‌కు దూర‌మైన ఆండ్రియా వెంక‌టేష్ సినిమాతో రీఎంట్రీ ఇవ్వ‌బోతుండ‌టం గ‌మ‌నార్హం. ఇక ఈమెను హీరోయిన్ గా ఎంపిక చేయడంపై చాలా కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇంత హాట్ బ్యూటీని తీసుకున్నారు. ఇది మరో రానానాయుడు కాదు కదా అనుకుంటున్నారు. హిట్ – 2 స‌క్సెస్ త‌ర్వాత శైలేష్ కొల‌ను ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ సినిమా క్రిస్మ‌స్ కానుక‌గా డిసెంబ‌ర్ 22న రిలీజ్ కానుంది. ఈ సినిమాకు ద‌స‌రా ఫేమ్ సంతోష్ నారాయ‌ణ‌న్ సంగీతాన్ని అందిస్తోన్నాడు. ప్రధాన తారాగణం పాల్గొంటున్న సైంధవ్ షూటింగ్ ప్రస్తుతం వైజాగ్‌లో జరుగుతోంది. ప్రముఖ సాంకేతిక ఈ చిత్రం కోసం పని చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here