Pawan Kalyan నోట ఫోక్ సాంగ్‌.. ఫ్యాన్స్ గెట్ రెడీ..!! కిర్రాక్ అప్‌డేట్‌.. పాట వింటే పూన‌కాలే

- Advertisement -

పవర్ స్టార్ Pawan Kalyan లో కేవలం ఒక నటుడు, దర్శకుడు మరియు రచయితా మాత్రమే కాదు, ఒక గొప్ప గాయకుడు కూడా ఉన్నాడు అనే విషయం మన అందరికీ తెలిసిందే. తమ్ముడు , ఖుషి , గుడుంబా శంకర్ , జానీ , అత్తారింటికి దారేది మరియు అజ్ఞాతవాసి వంటి చిత్రాలలో పాటలు పాడి ఫ్యాన్స్ ని ఉర్రూతలూ ఊగిపొయ్యెలా చేసాడు.

Pawan Kalyan
Pawan Kalyan

ఇప్పుడు ఫ్యాన్స్ కోసం మరోసారి పవన్ కళ్యాణ్ పాట పాడబోతున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. పవన్ కళ్యాణ్ తన సినిమాల్లో ఎక్కువగా ఫోక్ సాంగ్స్ ని పాడడానికి ఇష్టపడతాడు. రీసెంట్ గానే ఆయన ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఒక ఫోక్ సాంగ్ ఉంటుందట, అది పవన్ కళ్యాణ్ తో పాడించేందుకు ప్రయత్నం చేస్తున్నాడట హరీష్ శంకర్.

Pawan Kalyan Songs

రీసెంట్ గానే హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ ని ఈ పాట గురించి అడగగా, ఆయన వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన మొదటి షెడ్యూల్ ని పూర్తి చేసారు, పది రోజుల పాటు సాగిన ఈ షెడ్యూల్ లో పవన్ కళ్యాణ్ పై కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సన్నివేశాలకు సంబంధించిన ఎడిటింగ్ వర్క్ ని ఈమధ్యనే ప్రారంభించారు.

- Advertisement -
Pawan Kalyan ustaad bhagat singh

వచ్చే నెల 11 వ తేదీన గబ్బర్ సింగ్ చిత్రం విడుదలై 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మూవీ టీం ఈ చిత్రానికి సంబంధించిన గ్లిమ్స్ వీడియో ని విడుదల చేయబోతున్నారట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే చేయబోతుంది మూవీ టీం. వచ్చే సంక్రాంతి కానుకగా విడుదల అవ్వబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి పవన్ కళ్యాణ్ పాడే ఫోక్ సాంగ్ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here