Inaya Sultana : బిగ్ బాస్ ఇనయా అలాంటిదే.. సోహెల్ తో అలా చేస్తూ..వీడియో..

- Advertisement -

Inaya Sultana : పది సినిమాలు చెయ్యడం కన్నా కూడా ఒకసారి బిగ్ బాస్ లోకి వెళ్ళడం మేలు అని ఈ మధ్య సెలెబ్రేటీలు కూడా అనుకుంటున్నారట..అది నిజమే..ఎందుకంటే ఇచ్చిన టాస్క్లు చేస్తూ కెమెరా ముందు కనిపిస్తే చాలు డబ్బుల తో పాటు ఫెమ్ కూడా వస్తుందని అంటున్నారు.. తెలుగులో ఆరు సీజన్లను పూర్తీ చేసుకున్న విషయం తెలిసిందే..చివరి సీజన్ లో అందరి మాట పక్కన పెడితే..ఇనయా సుల్తానా మాత్రం బాగా పాపులర్ అయ్యింది. మొదటి రోజు నుంచి ఎలిమినేట్ అయ్యేవరకు బాగా ఇమేజ్ ను సంపాదించుకుంది… అయితే తనకు బిగ్ బాస్అటే ఎంత పిచ్చో అందరికి తెలుసు.. అతనికి రీసెంట్‌గా ప్రపోజ్ చేసింది.. ఆమె ప్రపొజల్ కు ఎవరైనా ఫిధా అవ్వాల్సిందె..ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది..

Inaya Sulthana
Inaya Sulthana

లేడీ టైగర్ అనిపించుకుంది. హౌస్ మొత్తం తనకు వ్యతిరేకంగా ఉన్నా గానీ ఇనయా మంచి పోరాటం పోరాడి… తిరుగులేని ఇమేజ్ సంపాదించుకుంది. నామినేషన్ లో ఉన్న ప్రతిసారి.. ఎక్కువ ఓట్లు రాబట్టింది. అయితే ఈ సీజన్ లో ఫ్యామిలీ ఎపిసోడ్ టైంలో సీజన్ 4 కంటెస్టెంట్.. సోహెల్ ..ఇనయా కోసం రావడం తెలిసిందే. ఇనయా తమ్ముడితో కలిసి వచ్చాడు.అప్పుడు అతడి పై వున్న క్రష్ గురించి ఓపెన్ అయ్యింది..మణికొండ రూమ్ కి షిఫ్ట్ అవ్వడం మాత్రమే కాదు… అతడు చేసే జిమ్ములో కూడా జాయిన్ అవ్వటం వంటి విషయాలు బయటపడ్డాయి. అయితే బిగ్ బాస్ సీజన్ సిక్స్ ఫ్యామిలీ వీక్ టైంలో అందరు చూస్తుండగానే తనకి సోహైల్ అంటే ఇష్టమని చెప్పెసింది.. అయితే ఇప్పుడు బయటకు వచ్చినా ఇనయా…సోహెల్ నీ కలిసి ఏకంగా ప్రపోజ్ చేసేసింది. ఇనయా ప్రపోజ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది…

Sohel
Sohel

ఆ వీడియోలో మొదట మీకో సర్ప్రైజ్ అని.. కళ్ళు మూసుకోవాలని తెలిపింది. దీంతో సోహెల్.. నువ్వు రాగానే నేను షాక్ అయిపోయా.. అని సమాధానం ఇచ్చాడు. ఆ తర్వాత ఇనయా…మోకాళ్ళ మీద ఉండి సోహెల్ కి రోజ్ ఫ్లవర్ ప్రపోజ్ చేయడం జరిగింది. ‘ఒకటి చెప్పదలచుకున్నాను.. నువ్వు ఏం అనుకున్నా పర్వాలేదు. నా మనసులో ఉన్నది నేను చెబుతానా మనసులోని మాట నీకు చెప్పాలనుకుంటున్నా సోహైల్‌. ప్రేమ ఉన్నంత వరకు కాదు.. ప్రాణం ఉన్నంత వరకూ నిన్ను ప్రేమిస్తూనే ఉంటా. నాకు నువ్వంటే చాలా ఇష్టం’ అని సొహైల్‌పై ప్రేమను కురిపించింది..అసలు ఆమె ప్రపొజల్ గురించి సొహైల్ ఎలా స్పందిస్తారో..ఏం చెప్తారో అన్నది ఆసక్థిగా మారింది..చూడాలి ఎలాంటి ఆన్సర్ ఇస్తారో.. ప్రస్తుతం సొహైల్ సినిమాలలో బిజిగా ఉన్నాడు..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here