Bigg Boss Sohel : అది చెయ్యడం ఇష్టం లేక చనిపోవాలనుకున్న బిగ్ బాస్ సొహైల్..వీడియో వైరల్..

- Advertisement -

Bigg Boss Sohel : కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు బిగ్ బాస్ ఎవ్వరికి తెలియని వాళ్ళను తీసుకొచ్చి సెలెబ్రేటీలను చేస్తున్నారు.. ఈ క్రమంలో ఎంతో మంది ఫెమస్ అయ్యారు. అందులో కొంతమందికి సినిమా అవకాశాలు వస్తే మరికొంతమంది మాత్రం పలు రకాల షోల ద్వారా ఫెమస్ అవుథున్నారు. అందులో సొహైల్ కూడా ఒకడు.. బిగ్ బాస్ ముందువరకు ఈ పేరు అంతగా ప్రజలకు తెలియదు. కానీ ఈ రియాల్టీ షోలోకి అడుగుపెట్టిన తర్వాత తన ఆట తీరుతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. కొన్ని సీరియల్స్, సినిమాల్లో నటించాడు కానీ అంతగా గుర్తింపు రాలేదు. అయితే సొహైల్ చనిపొవాలనుకున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.. అతని వచ్చిన కష్టం ఏంటో అని సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతుంది.

Bigg Boss Sohel
Bigg Boss Sohel

కస్సు బస్సు లాడుతూ.. తన అల్లరితో బుల్లితెర ఆడియన్స్ ను ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా హౌస్ లో ఉన్నప్పుడు అరియానాతో ఎప్పుడూ గొడవలు.. ఫ్రెండ్ షిప్ అట్రాక్షన్ గా నిలిచాడు. ప్రస్తుతం హీరోగా వెండితెరపై సందడి చేసేందుకు సిద్ధమైన సోహైల్.. జీవితంలో మాత్రం అనేక కష్టాలను ఎదుర్కొన్నారు. అంతేకాదు ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ప్రస్తుతం ఈ స్థాయికి చేరుకున్నాడు. మాటలతో ఒకానొక సమయంలో సూసైడ్ చేసుకోవాలనుకున్నాడట. అందుకు గల కారణాలను ఇటీవల అలీతో సరదాగా షోలో చెప్పుకొచ్చారు సోహైల్.

సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తో కలిసి అలీతో సరదాగా షోలో పాల్గొన్న సోహైల్ జీవితంలో ఎదుర్కొన్న కష్టాల గురించి చెప్పుకొచ్చారు.ఎప్పుడూ సరదాగా వుండే సొహైల్ చనిపొవాలనుకున్నా డట.. అంత కష్టం ఏమోచ్చిందో అని అందరూ ఆలోచనలో పడ్డారు..సోహైల్ మాట్లాడుతూ.. నేను చాలా నిదానస్తుడిని.. సున్నితమనస్కుడిని. మా నాన్న ప్రభుత్వ ఉద్యోగి..

- Advertisement -

ఆయనకు ఓపెన్ హార్ట్ సర్జరీ అయిన తర్వాత నన్ను ఉద్యోగం చేయమని ఇంట్లో వాళ్లు రోజూ అడిగేవారు. ఎప్పుడు సెటిల్ అవుతావు.. అంటున్నారు.. కానీ నాకేమో సినిమాలంటే ఇష్టం ఒక పిచ్చి.. అప్పటికీ రెండు సినిమాల్లో నటించాను.. కానీ..హీరోగా గుర్తింపు రాలేదు. ఇంట్లో ఉద్యోగమంటూ ఒత్తిడి. దీంతో డిప్రెషన్ లోకి వెళ్లిపోయి ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచన వచ్చింది. ప్రభుత్వ ఉద్యోగంలో చేరడానికి వెళ్లి కూడా నా గమ్యం ఇది కాదు అని వెనక్కు వచ్చేశాను. ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాను.. ఇలా నేను ఉండటానికి మా నాన్న ఎన్నో త్యాగాలు చేశారు అంటూ చెప్పుకొచ్చారు. ఇప్పుడు సొహైల్ నాలుగు సినిమాల్లో నటిస్తున్నారు.. ఆ సినిమాలు అన్నీ వచ్చే ఏడాదిలో విడుదల కానున్నాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here