వామ్మో.. జూనియర్ ఎన్టీఆర్ తో ప్రణతి ఎనిమిది నెలలు మాట్లాడలేదు..

- Advertisement -

సినిమాలతో ఎంత బిజీగా ఉన్న ఫ్యామిలీతో ఎక్కువ సమయం గడిపేందుకు ప్రయత్నిస్తారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా భార్యతో కలిసి వెకేషన్ కు వెళ్తుంటారు. హ్యాపీగా జాలీగా గడుపుతుంటారు. చక్కటి పిక్స్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు. భార్య, కుటుంబం పట్ల తారక్ చూపిస్తున్న ప్రేమకు ఆయన అభిమానులు ఫిదా అవుతుంటారు. ఇక యాక్టింగ్ లోనే కాదు యాంకరింగ్ లోనూ ఈ యంగ్ హీరో ఇరగతీస్తారన్న విషయం తెలిసిందే.

జూనియర్ ఎన్టీఆర్
జూనియర్ ఎన్టీఆర్

ఇక ఎన్టీఆర్ హోస్టింగ్ విషయానికి వస్తే.. పేరు పెట్టడానికి లేదు. కేవలం కరెంట్ అఫైర్స్ ఇష్యూపైనే షోని నడిపించి బోర్ కొట్టించకుండా.. తన మాటల ఛలోక్తులతో మెస్మరైజ్ చేస్తున్నారు. తన పర్సనల్ విషయాలను కూడా షేర్ చేసుకుని ఆటను రక్తి కట్టిస్తున్నారు. తాజా ఎపిసోడ్‌లో తన భార్య లక్ష్మీ ప్రణతి గురించి తెలియజేస్తూ.. పెళ్లి నాటి విషయాలను పంచుకున్నారు. హాట్ సీట్‌లో కూర్చున్న వ్యక్తి గురించి మాట్లాడిన ఎన్టీఆర్.. ‘మీది పెద్దలు కుదిర్చిన వివాహమే కానీ.. ఎస్ చెప్పడానికి నెల పట్టిందట ఎందుకు?? అని అడుగుతూ.. తన పెళ్లి నాటి విషయాన్ని పంచుకున్నారు ఎన్టీఆర్.

ప్రణతి
ప్రణతి

ఈయన అయితే కనీసం నెలకైనా మాట్లాడారు.. నా పెళ్లి చూపులు అప్పుడైతే మా ఆవిడ నాతో అస్సలు మాట్లాడలేదు.. అమ్మాయిని చూడగానే ఎస్ అని చెప్పి నేను వెళ్లిపోయాను.. కాని ఆవిడ మాత్రం ఎస్ అని చెప్పలేదు.. ఈలోపు పెళ్లి అయిపోయింది. ఆ తరువాత అడిగాను.. ఎస్‌నా కాదా.. నేనంటే ఇష్టమా కదా.. లేదంటే బలవంతంగా చేసేశారా? అని… మా పెళ్లి చూపులు అయిన తరువాత పెళ్లికి మధ్యలో 8 నెలల గ్యాప్ వచ్చింది. ఈ 8 నెలల్లో ఒక్కసారి కూడా ఎస్ అని చెప్పలేదు. నేను అర్థం చేసుకున్నా.. ఆడవాళ్లని అర్థం చేసుకున్నవాడు దేన్నైనా అర్థం చేసుకుంటాడు.. మోస్ట్ సక్సెస్ ఫుల్ పర్సన్‌గా మిగిలుతాడు కూడా’ అంటూ తన పెళ్లినాటి విషయాన్ని గుర్తు చేసుకున్నారు ఎన్టీఆర్.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here