RRR చిత్రం లో సీత పాత్రని మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..?

- Advertisement -

RRR కొన్ని చిత్రాల్లో కొంతమంది నటీనటులు చేసింది అతి తక్కువ నిడివి ఉన్న పాత్రే అయినా సినిమా మొత్తం వాళ్ళ ఎమోషన్ రన్ అయ్యేలా ఉంటుంది. ఆ పాత్రలను ప్రేక్షకులు కూడా అంత తేలికగా మర్చిపోలేరు. అలా #RRR చిత్రం లో అజయ్ దేవగన్ పాత్ర ఉంటుంది అని చెప్పొచ్చు. ఈ పాత్ర కనిపించేది కేవలం 20 నిముషాలు మాత్రమే. కానీ సెకండ్ హాఫ్ మొత్తం ఆ పాత్ర ఉంటుంది అనే రేంజ్ అనుభూతిని కలిగించింది.

RRR
RRR

అజయ్ దేవగన్ పాత్ర తర్వాత రామ్ చరణ్ కి జోడిగా నటించిన అలియా భట్ పాత్ర కూడా అలాంటిదే. ఈమె ఫస్ట్ హాఫ్ లో చిన్న చిన్న షాట్స్ లో అక్కడక్కడా కనిపిస్తుంది. సెకండ్ హాఫ్ లో ఒక 20 నిమిషాల సన్నివేశం లో కనిపిస్తుంది. ఈమె పాత్ర నిడివి చాలా తక్కువే అయినా, సినిమాకి ఆడియన్స్ ఎంతో ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యే విధంగా చేస్తుంది.

బాలీవుడ్ లో పెద్ద స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నప్పటికీ ఈ చిన్న పాత్ర చేయడానికి అలియా భట్ ఎందుకు ఒప్పుకుందో సినిమా చూసిన ప్రతీ ఒక్కరికీ అర్థం అయ్యింది. రామ్ చరణ్ పాత్ర ఈమె ఎంట్రీ తర్వాత ఒక రేంజ్ లో ఎలివేట్ అయ్యింది. అయితే ఈ పాత్ర కోసం తొలుత మన టాలీవుడ్ కి చెందిన స్టార్ హీరోయిన్స్ తోనే చేద్దాం అనుకున్నాడట రాజమౌళి. అందుకోసం రష్మిక మండన అయితే ఎలా ఉంటుంది అని ఆలోచించాడట.

- Advertisement -

సీత పాత్రకి సంబంధించిన స్కెచులు గీయించి, ఈ పాత్రకి రష్మిక సరిగ్గా సరిపోతుందని నమ్మకం కలిగిన తర్వాత ఆమెని సంప్రదించారట. అయితే ఆమె కాల్ షీట్స్ ఖాళీగా లేకపోవడం తో అలియా భట్ ని తీసుకున్నారట. అలియా భట్ కి కూడా ఈ సినిమా ప్రపోజల్ వచ్చినప్పుడు ఆమె డేట్స్ ఖాళీగా లేవు. కేవలం రాజమౌళి లాంటి డైరెక్టర్ తో పని చేసే అవకాశం కలుగుతుంది అనే ఉద్దేశ్యం తోనే ఆమె ఈ చిత్రానికి సంతకం చేసినట్టు తెలుస్తుంది. అంత పెద్ద బాలీవుడ్ హీరోయిన్ డేట్స్ ని సర్దుబాటు చేసి సినిమా చేసినప్పుడు రష్మిక కి ఏమైంది అని నెటిజెన్స్ సోషల్ మీడియా లో కామెంట్ చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here