Aliya అలియా భట్ బిజినెస్ ప్రమోషన్ తారక్ పిల్లల మీదేనా.?

- Advertisement -

Aliya టాలీవుడ్ ఇండస్ట్రీలో ఊహించిన స్థాయిలో క్రేజ్ సొంతం చేసుకున్న ఆలియా భట్.. తెలుగులో వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ కి జోడిగా ఆలియా భట్ ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించగా.. తారక్ కొరటాల శివ కాంభోలో సినిమాలో కూడా ఆలియా భట్ హీరోయిన్ గా ఫిక్స్ అయ్యారన్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమాతో తారక్ ఆలియా కి మంచి స్నేహ బంధం ఏర్పడింది.. దాంతో తాజాగా అలియా భట్ ఎన్టీఆర్ పిల్లలకు కొత్త బట్టలను పంపించింది..

Aliya
Aliya

బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ ను పెళ్లి చేసుకుని ఆలియా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆలియా పెళ్లికి ముందే 2021లో పిల్లల కోసం ప్రత్యేకంగా కాన్షియస్ క్లాతింగ్ బిజినెస్ ను ప్రారంభించింది. తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమాలోని కోస్టార్ జూనియర్ ఎన్టీఆర్ కి సర్ప్రైజ్ ఇచ్చింది. ఎన్టీఆర్ కొడుకులు నందమూరి అభయ్ రామ్, భార్గవ్ రామ్ కోసం కొన్ని బ్యూటిఫుల్ అవుట్ ఫిట్స్ ను పంపించింది.

కాగా ఈ అవుట్ ఫిట్స్ అభయ్, భార్గవ్ కి నచ్చుతాయని ఇన్స్టా స్టోరీ లో షేర్ చేసిన తారక్ ఆలియా కు థాంక్స్ చెబుతూ తన కోరికను బయటపెట్టాడు. దీనికి స్పందించిన ఆలియా ఎన్టీఆర్ ను స్వీటెస్ట్ అంటూ రిప్లై ఇచ్చింది. ఇంతకీ తారక్ ఏం అడిగాడంటే.. తన కొడుకులకు పంపించినట్టుగానే త్వరలో నాకు కూడా ఒక బ్యాగ్ నా పేరుతో రావాలని కోరుకుంటున్నానని పోస్ట్ చేశాడు. దీనికి స్పందించిన ఆలియా నీ కోసం ఈద్ స్పెషల్ వేర్ సిద్ధం చేస్తానంటూ హార్ట్ సింబల్ యాడ్ చేసింది. చివరిగా థాంక్స్ చెబుతూ స్వీటెస్ట్ అని తెలిపింది..

- Advertisement -

అలియా భట్ తన క్లాతింగ్ బిజినెస్ ప్రమోషన్ కోసం ఇండైరెక్టుగా తారక్ తో పాటు తన పిల్లల్ని కూడా యూస్ చేసుకుంది అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. బ్రాండింగ్ ప్రమోషన్ లో ఆలియా ఇలా పంపిందని మరి కొంతమంది అనుకుంటున్నారు. ఏది ఏమైనా సరే ఇలా ఆలియా తారక్ పిల్లలకి బట్టలు పంపించడం ఆనందంగా ఉందని తారక్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here