హీరోయిన్ Vijaya Shanthi కి ఇంత పెద్ద కొడుకు ఉన్నాడా..? ఆశ్చర్యాన్ని కలగజేస్తున్న విజయశాంతి లేటెస్ట్ కామెంట్స్Vijaya Shanthi టాలీవుడ్ లో హీరోలతో సరిసమానమైన ఇమేజి సంపాదించుకున్న హీరోయిన్ ఎవరు అంటే మన అందరికీ వెంటనే గుర్తుకు వచ్చే పేరు విజయశాంతి.తెలుగు , తమిళం మరియు హిందీ బాషలలో దాదాపుగా అందరి స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించిన విజయశాంతి.కేవలం హీరోయిన్ గా మాత్రమే కాదు, లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కూడా ఈమె పెట్టింది పేరు లాగ మారింది.ఈమెతోనే టాలీవుడ్ లో లేడీ ఓరియంటెడ్ సినిమాలు ప్రారంభం అయ్యాయి.

Vijaya Shanthi
Vijaya Shanthi

హీరోలతో సమానంగా ఫైట్స్ చెయ్యడం, భారీ డైలాగ్స్ చెప్పడం ఈమె స్పెషాలిటీ.అలా విలక్షణమైన పాత్రలు చేస్తూ లేడీ అమితాబ్ గా పేరు తెచ్చుకోండి ఆరోజుల్లోనే కోటి రూపాయిల రెమ్యూనరేషన్ తీసుకొని చరిత్ర సృష్టించింది.కేవలం సినిమాల్లోనే కాదు, రాజకీయాల్లో కూడా ఈమె తన మార్కు ని చూపించింది.రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత ఆమె సినిమాల్లో నటించకూడదు అనే బలమైన నియమం పెట్టుకుంది.అందుకు తగ్గట్టుగానే ముందుకెళ్లింది.

Vijaya

కానీ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రత్యేకంగా రిక్వెస్ట్ చెయ్యడం తో ‘సరిలేరు నీకెవ్వరూ’ చిత్రం లో ఒక పవర్ ఫుల్ పాత్ర పోషించింది.విజయశాంతి ని చాలా కాలం తర్వాత వెండితెర మీద చూసిన అభిమానులు ఎంతో థ్రిల్ కి గురయ్యారు.ఆ సినిమా తర్వాత ఆమెకి మరికొన్ని ఆఫర్స్ వచ్చినా కూడా చెయ్యను అని చెప్పేసింది.ఇది ఇలా ఉండగా విజయశాంతి భర్త ఎవరు, ఆమెకి పిల్లలు ఉన్నారా లేదా అనే సందేహం ప్రతీ ఒక్కరిలో ఉంటుంది.కానీ ఈమె MV శ్రీనివాస ప్రసాద్ అనే అతనిని 1988 వ సంవత్సరం లోనే పెళ్లాడింది.ఈయన టాలీవుడ్ టాప్ నిర్మాతలలో ఒకడు.

Shanthi

అయితే కొంత కాలం క్రితం విజయ శాంతి కొడుకు ఇతనే అంటూ సోషల్ మీడియా లో ఒక వార్త తెగ ప్రచారం అయ్యింది.ఆ ఫోటో చూసి విజయశాంతి కి ఇంత పెద్ద కొడుకు ఉన్నారా అని అందరూ ఆశ్చర్యపోయారు.అయితే ఇదే విషయాన్నీ రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో విజయశాంతి ని అడగగా, నాకు అసలు పిల్లలే లేరని, నా పూర్తి ద్రుష్టి ప్రజాసేవ మీదనే ఉంది కాబట్టి పిల్లల్ని కనకూడదు అనే నిర్ణయానికి వచ్చానని,వారి వల్ల నా పోరాట స్ఫూర్తి బలహీన పడే అవకాశం ఉందని, అందుకే పిల్లల్ని కనలేదు అని ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది.దీనితో ఎప్పటి నుండో సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న ఫేక్ ప్రచారాలకు తెరపడింది.