Divi Vadthya : పొలంగట్టున ఎర్రచీరలో బిగ్ బాస్ బ్యూటీ అందాల విందు



Divi Vadthya : బిగ్ బాస్ బ్యూటీ దివి గురించి తెలియని తెలుగు కుర్రాడు ఉండడు. ఈ అమ్మడు బిగ్ బాస్ కు ముందు అంతగా పరిచయం లేని పేరు. కానీ బిగ్ బాస్ ప్రోగ్రామ్ లోకి వచ్చాక ఈ బ్యూటీ ఫేటే మారిపోయింది. ఆ షోలో ఈ అమ్మాయి బాబా మాస్టర్ తో చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఇక ఛాన్స్ దొరికిన ప్రతిసారి తనలోని టాలెంట్ బయటపెడుతూ ప్రేక్షకుల మనసు దోచేసింది. 

Divi Vadthya
Divi Vadthya

దివి బిగ్ బాస్ షో విన్నర్ కాకపోయినా.. ప్రేక్షకుల మనసు మాత్రం గెలిచింది. అంతే కాదు అరడజనుకు పైగా అవకాశాలు కూడా దక్కించుకుంది. బిగ్ బాస్ వేదికపై సాక్షాత్తు మెగాస్టార్ చిరంజీవి దివికి ఛాన్స్ ఇస్తానని మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం దివికి గాడ్ ఫాదర్ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించే ఛాన్స్ వచ్చింది. ఆ పాత్రలో దివి అదరగొట్టింది.

Divi Vadthya  Saree Photos
Divi

ఇక ఈ భామ సోషల్ మీడియాలో కూడా చాలా పాపులర్. తరచూ తన ఫొటోలు షేర్ చేస్తూ కుర్రాళ్లను టెంప్ట్ చేస్తూ ఉంటుంది. ఓసారి బోల్డ్ ఫొటోలు.. మరోసారి ట్రెండీ ఫొటోలు.. ఇంకోసారి ట్రెడిషనల్ ఫొటోలు షేర్ చేస్తూ కుర్రాళ్ల గుండె కొల్లగొడుతూ ఉంటుంది. ఈ భామ ట్రెడిషనల్ ఫొటోల్లోనూ గ్లామర్ డోస్ యాడ్ చేయడం మరిచిపోదు. 

Divi Vadthya Latest Photos
Divi

తాజాగా దివి రెడ్ కలర్ శారీలో సందడి చేసింది. పచ్చని పంట పొలాల్లో ఎర్రచీరలో నడుం అందాలు చూపిస్తూ కుర్రాళ్లకు కైపెక్కించింది. ఇక మత్తెక్కించే చూపులతో విరహవేదనతో నలిగిపోతున్నట్లుగా ఇచ్చిన పోజులు చూసి కుర్రాళ్లకు కునుకు లేకుండా పోయింది. ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట సెగలు పుట్టిస్తున్నాయి.

Divi Vadthya New Images
Divi

ఈ ఫొటోలు చూసి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. చీరలోనూ దివి హాట్ గా ఉందంటూ ఫైర్ ఎమోజీస్ షేర్ చేస్తున్నారు. దివి రోజురోజుకు గ్లామర్ డోస్ పెంచేస్తుందంటూ కామెంట్లు చేస్తున్నారు. పొలంగట్టున పోజులిస్తున్న దివి.. దిగినుంచి భువికి దిగివచ్చావా అంటూ నెటిజన్లు కొంటెగా కవిత్వం కూడా రాసేస్తున్నారు.