Actress Sana Begum : ఆలీ రేజాతో బోల్డ్ గా నటించా.. మళ్ళీ నటిస్తానన్నా సనా..

- Advertisement -

Actress Sana Begum : తెలుగు సినీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా పేరు సంపాదించింది నటి సనా బేగం.. ఆ తర్వాత పలు సీరియల్స్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించింది.. అటు సినిమాలు, సీరియల్స్ లో కూడా నటిస్తూ బిజీ ఆర్టిస్టుగా మారిపోయింది. ముఖ్యంగా నాగార్జునతో నిన్నే పెళ్ళాడుతా సినిమాలో నటించింది ఈమె.. ఆ తర్వాత కూడా ఎన్నో చిత్రాలలో నటించింది. ముఖ్యంగా అక్క, వదిన , అత్త పాత్రలలో చేస్తూ తెలుగు ప్రేక్షకులను బాగా అలరించింది ఈమె తెలుగులోనే కాకుండా ఇతర భాషలలో కూడా నటించింది.

Actress Sana Begum
Actress Sana Begum

ఈమె నటించిన మెట్రో కథలు అనే వెబ్ సిరీస్ గురించి సనా పలు ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేసింది. మెట్రో కథలు అనే వెబ్ సిరీస్ ఒక మధ్య తరగతి గృహిణిగా నటించాను. అందులో ఒక యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకొని క్యారెక్టర్లలో నటించాను. అయితే అందులో ఒక తాగుబోతు భర్త ఉండి ఆ కుటుంబాన్ని నెట్టుకొచ్చే మహిళగా నటించాను.. ఈ సినిమాలో నటుడు ఆలీ రేజాతో చాలా బోల్డ్ గా నటించాను.. ఈ సిరీస్ గురించి మాట్లాడితే తన పాత్ర ఒక మంచి మెసేజ్ ఇస్తుంది కనుక ఈ పాత్ర సమాజానికి కూడా… ఎంతోమంది మహిళలకు ఉపయోగపడుతుంది. తన ఇంట్లో భర్త బాధ్యత లేకుండా తిరుగుతూ ఉంటే కష్టపడుతూ బతుకుతున్న వాళ్లు ఉంటారు..

ఇలాంటి ఒక పాత్ర చేసే అవకాశం తనకు వచ్చింది. తన క్యారెక్టర్ ఎంతోమంది ఇన్స్పైర్ అయ్యేలా చేస్తుందనిపించింది. అందుకే నటించానని తెలిపింది ఇకపై అలాంటి పాత్రలు వచ్చినా కూడా నటిస్తానని తెలిపింది ఇందులో పెద్ద ప్రొడక్షన్ హౌస్ మంచి డైరెక్టర్ అయినప్పుడు కచ్చితంగా చేస్తానంటూ తెలియజేస్తోంది సనా. అంతేకాకుండా తన కుటుంబంలో జరిగిన కొన్ని సంఘటనలను కూడా తెలియజేసింది సన.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here