Sreeleela : కుర్ర హీరోయిన్ శ్రీలీల KGF హీరో కి చుట్టరికమా..?

- Advertisement -

Sreeleela : ఇటీవల కాలం లో ఇండస్ట్రీ కి వచ్చిన హీరోయిన్స్ లో యూత్ మరియు మాస్ ఆడియన్స్ కి విపరీతంగా నాచేసిన హీరోయిన్ ఎవరైనా ఉన్నారా అంటే అది శ్రీ లీల అనే చెప్పాలి..పెళ్లి సందడి అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ కి పరిచయమైనా ఈ ముద్దుగుమ్మ కేవలం మొదటి సినిమాతోనే తన అద్భుతమైన నటన మరియు డ్యాన్స్ తో ప్రేక్షకులకు మెంటలెక్కిపొయ్యేలా చేసింది..ఆ సినిమాకి బ్యాడ్ రివ్యూస్ వచ్చినప్పటికీ కూడా అంత మంచి వసూళ్లు వచ్చాయంటే దానికి ప్రధాన కారణం శ్రీ లీల అనే చెప్పాలి.

Sreeleela

ఈ చిత్రం తర్వాత ఆమె హీరోయిన్ గా నటించిన ‘ధమాకా’ చిత్రం కూడా ఇంతే.. నెగటివ్ రివ్యూస్ తోనే బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది..ఈ సినిమా కూడా ఆ రేంజ్ లో ఆడదానికి కారణం శ్రీ లీల అని అంటున్నారు విశ్లేషకులు.. అందుకే ఇప్పుడు స్టార్ హీరోల దగ్గర నుండి కుర్ర హీరో ల వరకు అందరూ శ్రీ లీల డేట్స్ కోసం పడిగాపులు కాస్తున్నారు.

Sreeleela Photos

అయితే ఇంత క్రేజ్ సంపాదించిన శ్రీలీల గురించి తెలుసుకోవాలని ప్రతీ ఒక్కరికీ ఉంటుంది కదా..అలా యూట్యూబ్ లో ఆమె గురించి మన కుర్రోళ్ళు వెతుకుతున్నప్పుడు చాలా ఆసక్తికరమైన విషయాలు తెలిసాయి..ఈమె ప్రముఖ కన్నడ హీరో రాకింగ్ స్టార్ యష్ కి దగ్గర బంధువు అవుతుందని..అతని వల్లే ఈమెకి సినిమాల్లో అవకాశాలు వచ్చాయి అంటూ ఎన్నో కథనాలు కనిపించాయి..అయితే అదంతా ఫేక్ అని శ్రీ లీల ఇటీవలే ఒక ఇంటర్వ్యూ లో క్లారిటీ ఇచ్చింది.

- Advertisement -
Actress Sreeleela Photos

ఆమె మాట్లాడుతూ ‘మా అమ్మ ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో పెద్ద డాక్టర్..ఆమె యష్ గారి భార్య గర్భం దాలిస్తే ఆమెకి డెలివరీ చేసింది.. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా లో వచ్చేసరికీ అందరూ నేను యాష్ గారికి చుట్టాన్ని అవుతానని ప్రచారం చేసారు’ అని చెప్పుకొచ్చింది..ఇక శ్రీ లీల ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయానికి వస్తే ఇటీవలే ఆమె సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న సినిమాలో సెకండ్ హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యింది..ఈ సినిమాతో పాటుగా పంజా వైష్ణవ్ తేజ్ తో కూడా ఒక సినిమా చేస్తుంది..వీటితో పాటు మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ కి కూడా సైన్ చేసింది ఈ కన్నడ బ్యూటీ..వాటి వివరాలు తెలియాల్సి ఉంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here