Honey Rose : ఉల్లిపోరలాంటి చీరలో అందాల విందు చేస్తున్న హనీ రోజ్.. వైరల్..



మలయాళీ అందం హనీరోజ్ Honey Rose గురించి ఎంత చెప్పినా తక్కువే.. వర్ణించడానికి కూడా సరిపోవు ఇంకా కావాలనేంత అందం ఆమెది.. బాపు బొమ్మ, అందాల బరినే ఇలా చెప్పుకుంటూ పోతే మాటలు చాలవు.. మనకు రాతలు చాలవు.. వీరసింహా రెడ్డి సినిమాలో మీనాక్షి పాత్రలో తన అందచందాలతో వావ్ అనిపించిన ఈ భామకు బాలయ్య మరో ఛాన్స్ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. బాలయ్య తన తర్వాత సినిమాను అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా హనీరోజ్ ఖరారు అయ్యినట్లు తెలుస్తోంది.

Veera Simhareddy Actress Honey Rose
Veera Simha reddy Actress Honey Rose

ఇద్దరు హీరోయిన్స్‌కు అవకాశం ఉండడంతో మరో హీరోయిన్‌ కోసం టీమ్ అన్వేషణలో ఉందని టాక్.. కాగా, ప్రస్తుతం ఈ అమ్మడు ఫోటోలు కొన్ని నెట్టింట వైరల్ అవుతున్నాయి..ఈ సినిమా భారీ అంచనాల నడుమ తెరకెక్కుతోన్న ఈ సినిమాపై ఫ్యాన్స్ భారీ అంచనాలను పెట్టుకున్నారు. చూడాలి మరి ఈ సినిమా ఎలా ఉండనుందో.. ఇక గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన వీరసింహారెడ్డి సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలై దాదాపుగా బ్రేక్ ఈవెన్‌ను పూర్తి చేసుకుంది..

Actress Honey Rose
Actress Honey Rose

ఈ సినిమాలో మెరిసిన ఈ ముద్దుగుమ్మ కుర్రాళ్ల గుండెలను కోళ్లగొట్టేసింది..2008 లోనే తెలుగు తెరకు పరిచయం అయినా కూడా అవి అంత హిట్ ను అందించలేదు.. వీరసింహారెడ్డి సినిమాతో హానీరోజ్‌ కు కావాల్సినంత పాపులారిటీ వచ్చింది. దీంతో ప్రస్తుతం తెలుగులో కూడా మంచి అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ భామకు ఇటు నటనకు ఆస్కారం ఉన్న పాత్రలతో పాటు అటు గ్లామర్ పాత్రలు కూడా వస్తున్నట్లు టాక్. చూడాలి మరి తెలుగులో ఈ భామ భవిష్యత్తు ఎలా ఉండనుందో.. ఎన్నేళ్లు ఇక్కడ పాగా వెయ్యనుందో.. ప్రస్తుతం ఈమె ఎక్కడ కనిపించినా కెమెరాలతో రెడీగా ఉంటున్నారు జనాలు.. నెట్టింట ఎక్కడ చూసినా కూడా హానీరోజ్‌ ఫొటోలు అందాల విందు చేస్తూ కుర్రాళ్లకు ఫుల్ మీల్స్ పెడుతున్నారు.. మీరు ఆ ఫోటోలపై ఓ లుక్ వేసుకోండి..