భర్తతో విడిపోయి.. బాయ్ ఫ్రెండ్ కి కూడా హ్యాండ్ ఇచ్చిన హీరోయిన్..?

- Advertisement -

ఇండస్ట్రీలోకి రావడం.. తొలి పరిచయంలోనే స్నేహం.. ఆ తర్వాత ప్రేమ.. ఇంకేముంది పెళ్లి. కెరీర్ పీక్ టైంలో ఉన్నప్పుడు వివాహం చేసుకుని ఓవైపు కెరీర్.. మరోవైపు పర్సనల్ లైఫ్ ఇలా రెండింటిని బ్యాలెన్స్ చేయలేక.. ఇంకా రకరకాల కారణాలతో చాలా మంది హీరోయిన్లు కొంతకాలానికే విడాకులు తీసుకుంటున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ లో విడాకుల ట్రెండ్ ఎక్కువైపోయింది. పెళ్లి చేసుకున్న ఏడాది విడిపోతున్న వారు కొందరైతే దశాబ్ధాల పాటు దాంపత్య బంధంలో ఉండి పిల్లలు పెద్దవాళ్లయ్యాక విడిపోతున్న వాళ్లు మరికొందరు. అలా బాలీవుడ్ లో ఓ స్టార్ హీరో సోదరుడైన మరో హీరోను ప్రేమ పెళ్లి చేసుకుంది ఓ హీరోయిన్. వాళ్లిద్దరి ప్రేమకు గుర్తుగా కొడుకు కూడా పుట్టాడు. ఆ తర్వాత షురూ అయింది అసలు సంగతి. కారణాలేవే బయటకు తెలియదు కానీ ఇద్దరూ విడిపోయారు.

కొంత కాలం విడిగా ఉన్న ఈ ఇద్దరు స్టార్స్.. తర్వాత విడాకులు తీసుకున్నారు. కానీ కొడుకు బాధ్యత మాత్రం ఇద్దరూ తీసుకున్నారు. ఇప్పుడు ఆ కొడుకు పెద్దవాడయ్యాడు. తల్లిదండ్రులు సిట్యుయేషన్ పూర్తిగా అర్థం చేసుకున్నాడు. అటు తల్లి దగ్గర.. ఇటు తండ్రి ప్రేమను విడిగా పొందుతున్నాడు. అయితే స్టార్ హీరోతో విడిపోయిన ఈ బ్యూటీ కొన్నాళ్ల క్రితం ఓ యంగ్ హీరోతో డేటింగ్ మొదలుపెట్టింది. డేటింగ్ కాస్త కొన్ని రోజులకు ప్రేమగా మారింది. మొదట్లో సీక్రెట్ గా మెయింటైన్ చేసిన వీళ్ల రిలేషన్షిప్ తర్వాత తర్వాత అందరికీ తెలిసిపోయింది.

- Advertisement -

 

తాము చేస్తోంది తప్పేం కాదని భావించిన ఈ స్టార్స్ ఇద్దరు వాళ్ల రిలేషన్షిప్ ని అఫీషియల్ చేసేశారు. ఫ్యాన్స్ అందరికీ చెప్పేశారు. ఇక అప్పటినుంచి ఇద్దరూ ఒకరిపై మరొకరికి ఉన్న ప్రేమను బహిరంగంగానే వ్యక్తపరుస్తున్నారు. కలిసి పార్టీలు, డిన్నర్ డేట్లు, వెకేషన్లతో వీరి ప్రేమ మూడు సాండ్విచ్ లు ఆరు కాక్ టైల్స్ గా హ్యాపీగా సాగిపోతోంది.

అయితే వీరి ప్రేమకు నెటిజన్ల నుంచి కాస్త నెగెటివ్ రెస్పాన్స్ రావడం మాత్రం నిజం. 50 ఏళ్లకు చేరువలో ఉన్న హీరోయిన్ తో నీకు ప్రేమేంటి అంటూ ఆ యంగ్ హీరోను తిట్టనివాళ్లు లేరు. అలాగే పెళ్లీడుకొచ్చిన కొడుకుని పెట్టుకుని నీకంటే చిన్న వాడితో లవ్ ఏంటి అంటూ హీరోయిన్ పై చికాకు పడినవాళ్లూ ఉన్నారు. అవేమీ వీరి ప్రేమను అడ్డుకోలేదు. ప్రేమకు వయసు అక్కర్లేదు. మేం ఇద్దరం మా ఒకరికొకరి కంపెనీలో హ్యాపీగా ఉన్నాం. మాకు లేని బాధ మీకెందుకు అంటూ ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. ఒకానొక స్టేజ్ లో క్రిటిసిజమ్ ఎక్కువ కావడంతో ఈ కపుల్ గట్టిగా స్పందించారు.

 

తమను నిజంగా అభిమానించే వాళ్లైతే ఇలాంటి హేట్రేడ్ క్రియేట్ చేయరంటూ.. తమ ఫ్యాన్స్ తమని అర్థం చేసుకున్నారని.. ఇలాంటి ఫేస్ లేని హేట్రేడ్ ని తలకు ఎక్కించుకుని బాధపడాల్సిన అవసరం లేదని స్టేట్ మెంట్ కూడా ఇచ్చారు. ఎంత సెలబ్రిటీలు అయినా తమకంటూ ఓ పర్సనల్ లైఫ్ ఉంటుందని.. అది తమకు నచ్చినట్టుగానే ఉండాలని అనుకుంటున్నామని చెప్పారు.

ఇక అప్పటి నుంచి కాస్త నెగిటివిటీ తగ్గింది. రాన్రానూ ఈ కపుల్ పై నెటిజన్లు కూడా మనసు పారేసుకున్నారు. అయితే రీసెంట్ గా ఆ హీరోయిన్ పెట్టిన ఓ పోస్ట్ తో వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు అనుకున్నారందరూ. ఫ్యాన్స్ అయితే చాలా ఖుష్ అయిపోయారు కూడా. అయితే కాసేపటికే ఆ బ్యూటీ తన పోస్టుకు అర్థమేంటో చెప్పేసింది. తాను చెప్పింది పర్సనల్ లైఫ్ గురించి కాదని ప్రొఫెషనల్ లైఫ్ గురించి అని.. ఓ షోకి ఎస్ చెప్పానని క్లారిటీ ఇచ్చింది. ఇక ఈ భామ ఇచ్చిన క్లారిటీతో డిసప్పాయింట్ అయిన కొందరు అప్పుడేమో భర్తతో విడిపోయింది.. ఇప్పడు బాయ్ ఫ్రెండ్ కి కూడా హ్యాండ్ ఇచ్చేలా ఉంది అనుకుంటూ కామెంట్స్ పెడుతున్నారు.

 

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here