Hansika Wedding: హన్సిక-సోహెల్ పెళ్లి వేడుక.. ఓటీటీలో లైవ్ స్ట్రీమింగ్..!

- Advertisement -

చైల్డ్ ఆర్టిస్ట్​గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన హన్సిక.. చిన్నతనంలోనే హీరోయిన్​గా మారింది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్​తో కలిసి దేశముదురు సినిమాలో నటించి టాలీవుడ్​లోకి అడుగుపెట్టింది. ఫస్ట్ మూవీతోనే బ్లాక్​బస్టర్ హిట్ అందుకుని ఆ తర్వాత వరుస ఆఫర్లతో దూసుకెళ్లింది. కొంతకాలం అగ్రహీరోలతో కలిసి సూపర్ హిట్​ మూవీస్ చేసింది. అందం, అభినయంతో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న హన్సిక.. ఇప్పటివరకు 50 సినిమాలకుపైగా నటించింది. టాలీవుడ్​లో ఫేడ్ అవుట్ అయిన హన్సికకు ఆఫర్లు కరవయ్యాయి. అడపాదడపా తమిళ సినిమాల్లో నటిస్తున్నా.. అవి సరిగ్గా ఆడటం లేదు.

Hansika Wedding
Hansika Wedding

 

 

- Advertisement -

అవకాశాలు తగ్గుముఖం పట్టడంతో హన్సిక త్వరలోనే వివాహం చేసుకోవడానికి రెడీ అయింది. ప్రముఖ వ్యాపారవేత్త సోహెల్​ను పెళ్లి చేసుకుంటున్నట్లు హన్సిక చెప్పింది. పారిస్‌లోని ఐఫిల్ టవర్‌కు ఎదురుగా ఎర్రగులాబీలు, కొవ్వొత్తుల నడుమ సోహెల్ తనకు ప్రపోజ్ చేసిన ఫొటోలను హన్సిక ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది. ‘ఇప్పటికీ ఎప్పటికీ ఉండే ప్రేమ’ అంటూ కొటేషన్ కూడా పెట్టింది. హన్సిక ఈ ఫొటోలు సోషల్ మీడియాలో పెట్టగానే ఆమె పెళ్లి విషయం టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయింది.

 

హన్సిక, సోహెల్ వివాహం డిసెంబర్ 4న రాజస్థాన్‌లోని జైపూర్‌లో అంగరంగ వైభవంగా జరగనుంది. పెళ్లిరోజు ఉదయం హల్దీ (పసుపు) వేడుక జరగనుందని సమాచారం. ఇక డిసెంబర్ 3న హెహందీ, సంగీత్ వేడుకలు జరుగుతాయి. ఇక్కడ వరకు బాగానే ఉంది. హన్సిక వైవాహిక జీవితాన్ని మొదలుపెట్టబోతోంది. సుమారు రెండు దశాబ్దాల సినీ జీవితాన్ని ఆస్వాదించిన హన్సిక.. 31 ఏళ్ల వయసులో కొత్త జర్నీని స్టార్ట్ చేయబోతోంది.

హన్సిక-సోహెల్ స్నేహితులు మాత్రమే కాకుండా బిజినెస్ పార్టనర్​గా కూడా పలు ఈవెంట్లలో ఆర్గనైజేషన్​లో కూడా పెట్టుబడులు పెట్టినట్లుగా తెలుస్తోంది. వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని కొంతకాలం పాటు డేటింగ్​లో ఉన్నారని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ బ్యూటీ మ్యారేజ్​కు సంబంధించిన ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. హన్సిక వివాహ వేడుకలు ప్రముఖ ఓటీటీలో లైవ్ స్ట్రీమింగ్​ కానున్నాయట.

మరోవైపు వివాహం తర్వాత హన్సిక నటనకు గుడ్ బై చెప్పబోతోందంటూ పలు వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ విషయంపై హన్సిక ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తను వివాహమైన సరే సినిమాలకు గుడ్ బై చెప్పేదే లేదని అవకాశాలు వస్తే నటించేందుకు ఎప్పుడైనా సరే సిద్ధంగానే ఉన్నాను అంటూ చెప్పింది. హన్సిక చివరిసారిగా ‘మహా’ సినిమాలో నటించింది.

హన్సికకు కాబోయే భర్తకు ఇదివరకే పెళ్లయిందట. సోహెల్‌కు ఇది వరకే రింకీ అనే అమ్మాయితో వివాహం జరిగిందట. 2016లో గోవాలో వీరి వివాహం జరిగింది. అయితే, తరవాత వీరిద్దరూ విడిపోయారు. గోవాలో జరిగిన సోహెల్, రింకీ పెళ్లి వేడుకలో హన్సిక పాల్గొన్న వీడియో ఒకటి ప్రస్తుతం ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది. రింకీ, సోహెల్ పెళ్లి వేడుక ట్రైలర్ వీడియో అది. ఈ వీడియోలో హన్సిక కనిపించడమే కాదు.. సంగీత్ వేడుకలో పెళ్లికూతురుతో కలిసి డాన్సులు కూడా చేసింది. అలాగే రోకా వేడుకలో పాల్గొంది. దీంతో హన్సికకు రింకీ బెస్ట్ ఫ్రెండ్ అని.. ఆ స్నేహితురాలి మాజీ భర్తనే ఇప్పుడు హన్సిక పెళ్లాడబోతోందని అంటున్నారు. మరి దీనిలో నిజమెంత అనే విషయం హన్సికే చెప్పాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here