Unstoppable with NBK : పవన్ – మహేష్ – ప్రభాస్ ‘అన్ స్టాపబుల్’ ఎపిసోడ్స్ లో మిమల్ని అమితం గా ఆకట్టుకున్న ఎపిసోడ్ ఏమిటి?

pawan kalyan mahesh babi prabhas


Unstoppable with NBK : ఆహా మీడియా లో నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘అన్ స్టాపబుల్ విత్ NBK ‘ టాక్ షో ఎంత పెద్ద సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే.మొదటి సీజన్ ని దిగ్విజయం గా పూర్తి చేసుకున్న ఈ టాక్ షోకి సంబంధించి రెండవ సీజన్ కూడా ఇటీవలే ప్రారంభమై చివరి దశకి చేరుకుంది.

ఈ చివరి ఎపిసోడ్ ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో చేసి మొదటి భాగం ని ఇటీవలే విడుదల చేసారు.ఈ ఎపిసోడ్ కి సంబంధించిన రెండవ భాగం ని ఈ నెల 10 వ తారీఖున విడుదల చెయ్యబోతున్నారు.మొదటి ఎపిసోడ్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది, ఇప్పటి వరకు టెలికాస్ట్ చేసిన అన్నీ ఎపిసోడ్స్ కంటే దీనికే ఆల్ టైం రికార్డు రేంజ్ వ్యూస్ వచ్చాయని ఆహా మీడియా అధికారికంగా ప్రకటించింది కూడా.

ఈ ఎపిసోడ్ కి ముందు పాన్ ఇండియన్ సూపర్ స్టార్ ప్రభాస్ తో కూడా ఒక ఎపిసోడ్ ని షూట్ చేసారు.ఈ ఎపిసోడ్ కి కూడా అదిరిపొయ్యే రేంజ్ రెస్పాన్స్ వచ్చింది, రెండు భాగాలుగా విడుదల చేసిన ఈ ఎపిసోడ్ లో బాలయ్య ప్రభాస్ తో చేసిన సందడి అభిమానులకు మరియు ప్రేక్షకులకు బాగా నచ్చింది.

pawan kalyan balakrishna Unstoppable with nbk
pawan kalyan balakrishna Unstoppable with nbk

ఇప్పటి వరకు ప్రసారమైన సెలబ్రిటీ ఎపిసోడ్స్ అన్నిటికంటే దీనికే అద్భుతమైన ఫీడ్ బ్యాక్ వచ్చింది, పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ కి రికార్డ్స్ అయితే వచ్చాయి కానీ , పవన్ కళ్యాణ్ పెద్దగా మాట్లాడలేదు అనే భావన అందరిలో కలిగింది.స్వతహాగా సిగ్గు బిడియం వంటి స్వభావాలు ఉన్న పవన్ కళ్యాణ్ ఇలాంటి టాక్ షోస్ కి మొదటి నుండి దూరంగా ఉంటూనే వచ్చాడు, కానీ అల్లు అరవింద్ మరియు బాలయ్య స్థాయి వ్యక్తులు ఆయనని ఈ టాక్ షో కి విచ్చేయమని అడగడం తో కాదనలేక వచ్చాడు.ఆ మాత్రం మాట్లాడడమే చాలా ఎక్కువ అని అభిమానులు అంటున్నారు.

Mahesh Babu at balakrishna unstoppable with nbk

ఇక ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ మొదటి సీజన్ చివరి ఎపిసోడ్ కి సూపర్ స్టార్ మహేష్ బాబు ముఖ్య అతిథిగా హాజరైన సంగతి అందరికీ తెలిసిందే.ఈ ఎపిసోడ్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది, మహేష్ బాబు అంటేనే టైమింగ్..తన ఇన్ బిల్డ్ టైమింగ్ తో అప్పటికప్పుడు వేసే పంచులు బాగా పేలుతాయి, బాలయ్య ఎపిసోడ్ లో కూడా అది వర్కౌట్ అవ్వడం తో ఇప్పటికి ఆహా యాప్ లో అత్యథిక వ్యూస్ సొంతం చేసుకున్న ఎపిసోడ్ గా నిలిచింది.

prabhas balakrishna

అయితే ఈ ముగ్గురు స్టార్ హీరోల ఎపిసోడ్స్ లో ప్రభాస్ ఎపిసోడ్ కి ఎక్కువగా పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి, బాలయ్య – ప్రభాస్ – గోపీచంద్ మాట్లాడుకున్నంత సేపు సెలబ్రిటీస్ మాట్లాడుకున్నట్టు లేదు,ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ కూర్చొని కాసేపు సరదాగా కబుర్లు చెప్పుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది.అయితే పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ పార్ట్ 2 ఎవ్వరు ఊహించనంత అద్భుతం గా ఉంటుందని ఆహా మీడియా వారు చెప్తున్నారు.

ఈరోజు దీనికి సంబంధించిన ప్రోమో విడుదల కాబోతుంది.. మరి ‘అన్ స్టాపబుల్ విత్ NBK‘ ఎపిసోడ్ కి ఫ్యాన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ రాబోతుందో చూడాలి. అయితే వ్యక్తిగతంగా మీ అందరికి నచ్చిన ఎపిసోడ్ ఏమిటో క్రింద కామెంట్స్ లో చెప్పండి.

Tags: